అయితే ఈమెకు డ్రగ్స్ టెస్ట్ చేశాక నెగిటివ్ రిపోర్ట్ రావడంతో అందరూ హేమను నమ్మరు. ఇలా డ్రగ్స్ అనేవి సినీ ఇండస్ట్రీలో ఎక్కువైపోయాయి.అయితే తాజాగా బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఓ స్టార్ హీరోయిన్ తమ్ముడు డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుపడ్డాడు. దీంతో ప్రస్తుతం ఈ మ్యాటర్ టాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.. తాజాగా సైబరాబాద్ పోలీసులు 200 గ్రాములకు పైగా కొకైన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ డ్రగ్స్ తెచ్చిన వారిలో ఐదుగురు నైజీరియన్ లు .
అయితే మరో వ్యక్తి టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు.ఇక ఈ కేసులో కొంతమంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్ళు ఎంతో మంది విఐపి లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ హీరోయిన్ సోదరుడు హైదరాబాద్ తో పాటు ముంబైలో కూడా పలు వ్యాపారాలు చేస్తారట.ఇక ఈ డ్రగ్స్ కేసులోనైజీరియన్ల నుండి డ్రగ్స్ కొనుగోలు చేసిన మరో ఐదుగురితో పాటు కొంతమంది సినీ సెలబ్రిటీలు వ్యాపారస్తులను కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది