కొన్నాళ్లుగా మన తెలుగు సినీ పరిశ్రమలో ఒక ట్రెండ్ నడుస్తుంది. షూటింగ్ జరుపుకుంటున్న సినిమాకు సంబంధించి విపరీతంగా ప్రచారం చేస్తారు. ఆ సినిమా విడుదలవడానికి ముందు పోస్టర్ల, టీజర్లు, పాటలు ఒక్కొక్కటిగా విడుదల చేసుకుంటూ వచ్చి విపరీతమైన అంచనాలను పెంచేస్తుంటారు. అందరూ తగ్గట్లుగానే స్టార్ హీరోల సినిమాల కు సంబంధించి గ్లింప్స్ అని, టీచర్ అని, ట్రైలర్ అని..ఇలా విడతల చేసుకుంటారు. వీటిల్లో చూపించే యాక్షన్ సన్నివేశాలు చూపి ప్రేక్షకులు కూడా అంచనాలు భారీగా పెంచేసుకుంటున్నారు. తీరా సినిమా విడుదలైన తరువాత థియేటర్ కు వెళితే అరగంటలోపే ఆ థియేటర్ నుంచి బయటకు పరిగెత్తుకుంటూ రావటం జరుగుతుంది.


ఇటువంటి అంచనాలను పెంచుకుని విడుదలైన తరువాత భారీ డిజాస్టర్లుగా నిలిచిన టాప్-10 సినిమాలను ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ జాబితాలో ప్రదానంగా చెప్పుకోవాల్సి ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా. మోహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో నే భారీ డిజాస్టర్లలో ఒక్కటిగా పేరు తెచ్చుకుంది. ఒకరకంగా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ను ఇది తీవ్రంగా ప్రభావితం చేసింది. మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన స్పైడర్ కూడా అంచనాలు అందుకోలేక అందరిని ముంచేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్ గా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి దర్శకుడు. అక్కినేని నాగచైతన్య- కాజల్ కాంబినేషన్ లో వచ్చిన దాడ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. సినిమా హిట్ అవుతుందని అందరూ భావించగా భారీ ఫ్లాప్ గా నిలిచింది.


విజయ్ దేవరకొండ- రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ డిజాస్టర్ ను మూటకట్టుకుంది. భారత్ కమ్మ దీనికి దర్శకుడు. బాహుబలి తర్వాత విడుదలయ్యే చిత్రం కావటంతో ప్రభాస్ నటించిన సాహో పై అంచనాలు విపరీతంగా పెరిగాయి. విడుదలైన తరువాత ఈ సినిమా ఎవరికి అర్థంకా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సినిమా తీసిన దర్శకుడినైనా అర్థమైందా? అంటూ అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. నాగార్జున- ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ది షూస్ట్ కూడా షూ ర పరాజయం పాలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: