సాదరణంగా భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల హీరోలను సైతం తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా తెలుగు హీరోలే అన్నట్లుగా ఆదరిస్తూ అభిమానిస్తూ ఉంటారు. ఇలా తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా బాగా దగ్గరైన తమిళ హీరోలలో శివ కార్తికేయన్ కూడా ఒకరు అని చెప్పాలి. ఇప్పటివరకు శివ కార్తికేయన్ నటించిన ఎన్నో సినిమాలు అటు టాలీవుడ్ లో కూడా సూపర్ డూపర్ విజయాలు సాధించినవి చాలానే ఉన్నాయి.


 ఎప్పటికప్పుడు వినూత్నమైన కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తూ ఇక ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు శివ కార్తికేయన్. అయితే అతనికి ఇటీవల  కొడుకు పుట్టాడు అనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అనౌన్స్ చేశాడు. దీంతో అభిమానులందరూ కూడా తెగ ఆనందపడిపోయారు.



 అయితే ఇటీవలే తన కొడుకుకు నామకరణం చేయగా ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో శివ కార్తికేయన్ షేర్ చేశాడు. ఇప్పటికే ఈ హీరోకి గగన్ అనే కొడుకు ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శివ కార్తికేయన్ కి సోషల్ మీడియా వేదికగా అభిమానులు స్నేహితులు సెలబ్రిటీలు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే కేవలం ఇంట్లోనే జరిగిన ఈ వేడుకకు సన్నిహితులు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. కాగా ఈ వీడియోలో తన భార్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు శివ కార్తికేయన్. ఈ క్రమంలోనే తన బిడ్డకు ఏకంగా పవన్ అనే పేరు పెట్టాడు శివ కార్తికేయన్. దీంతో ఈ విషయం తెలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా తెగ మురిసిపోతున్నారు. కాగా హీరోగా సక్సెస్ చూడని సమయంలో  ఆర్తిని శివకార్తికేయన్ పెళ్లి చేసుకున్నాడు  ఈ హీరో కెరియర్ లో వెన్నంటే ఉంటూ ఎప్పుడు సపోర్ట్ అందించింది భార్య ఆర్తి.

మరింత సమాచారం తెలుసుకోండి: