సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం అందాల ఆరబోత మాత్రమే అనుకునేవారు ఒకప్పుడు. అందాల ఆరబోత చేసిన హీరోయిన్ కెరియర్ సాఫీగా సాగుతుందని.. అలా కాకుండా పొట్టి డ్రెస్సులు వేసుకోవడానికి ఇష్టపడని హీరోయిన్లకు పెద్దగా అవకాశాలు రావు అనుకునేవారు  కానీ ఇలాంటి ఆలోచనలు పోగొట్టారు తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతమంది హీరోయిన్లు. ఎక్కడ అందాల ఆరబోతకు తావు లేకుండా వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగిన వారు కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో సాయి పల్లవి కూడా ఒకరు అని చెప్పాలి.


 ఆమె ఎక్కడ అందాల ఆరబోత చేయదు. అందరిలాగా చిట్టి పొట్టి డ్రెస్సులు అస్సలు వేసుకోలేదు. అంతేకాదు ఇక సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యం  ఉండాల్సిందే. ఇవేవీ లేకుండా సాయి పల్లవి చేసిన సినిమా ఆమె కెరియర్ లో ఒక్కటి కూడా లేవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా అవకాశాలు వచ్చిన రాకున్నా తాను మాత్రం తన కండిషన్స్కు అనుగుణంగానే కెరియర్ను కొనసాగిస్తాను అంటూ ఇప్పటికీ మొండి పట్టుతూనే ఉంది ఈ హీరోయిన్. ఇక సాయి పల్లవి నటనలోనే కాదు డాన్సుల్లో కూడా ఎలా ఇరగదీస్తూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.



 ఇకపోతే సాయి పల్లవికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఫేవరెట్ హీరో ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే తెలుగులో సాయి పల్లవికి ఫేవరెట్ హీరో  మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టమని ఎన్నో సందర్భాలలో తెలియజేసింది. ఇక చిరంజీవిని చూసి తాను డాన్స్ నేర్చుకున్నానని.. చిరంజీవితో కలిసి డాన్స్ చేయడం తన డ్రీమ్ అంటూ తెలిపింది. అలాగే తను చిరంజీవి పక్కన డాన్స్ చేస్తూ అందరి చేత విజిల్స్ వేయించుకోవడం కూడా తన కోరిక అంటూ తెలియజేసింది సాయి పల్లవి. అయితే గతంలో చిరంజీవితో కలిసి బోలా శంకర్ మూవీలో నటించే అవకాశం వచ్చిన సాయి పల్లవి రిజెక్ట్ చేసింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: