హీరోయిన్ నబా నటేష్, హీరోగా ప్రియదర్శి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం డార్లింగ్.. ఇది వరకే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు తాజగా ట్రైలర్ కూడా విడుదల అవ్వడంతో ఈ సినిమా పైన మరింత క్యూరియాసిటీ పెంచేస్తోంది. టీజర్, ట్రైలర్ తో ఉత్సాహం పెంచిన డార్లింగ్  సినిమా ఈ చిత్రంలో ఏదో సంథింగ్ ఉన్నంతగా ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. డార్లింగ్ ట్రైలర్ ను నాని విడుదల చేశారు.. ముఖ్యంగా ఇందులో ప్రియదర్శిని భార్యగా నభా నటేష్ అద్భుతంగా నటించింది.



అంతేకాకుండా మీరిద్దరి మధ్య జరిగేటువంటి సన్నివేశాలు కూడా ప్రేక్షకులను కామెడీ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు టచ్ చేసేలా ఉన్నాయి.అలాగే స్నేహితులతో కలిసి చేసే కొన్ని సన్నివేశాలు కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అడ్డు అదుపు లేని భార్య ఎలా ఉంటుందో అలాంటి పాత్రలో నభ అద్భుతంగా ఇందులో నటించినట్లుగా కనిపిస్తోంది. ఫన్ ఎలిమెంట్ కూడా మరింత ఆకట్టుకునేలా కనిపిస్తోంది.. అలాగే భార్యతో ప్రియదర్శి ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటారని విషయాన్ని కూడా తెలియాలి అంటే తెలపైన చూడాల్సి ఉంటుంది.


డార్లింగ్ లో నభా , ప్రియదర్శి మొదటిసారిగా నటిస్తూ ఉన్నారు ఇంతకుముందు విడుదలైన పోస్టర్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఈనెల 19న ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. డైరెక్టర్ అశ్విని రాం దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ తర్వాత ఈ సినిమాలో నభా నటేషా నటిస్తూ ఉన్నది. మరి ఈ సినిమాతో నైనా భారీ కమ్ బ్యాక్ ఇస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం డార్లింగ్ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రియదర్శి కూడా పలు  సినిమాలలోనే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటించి ఈమధ్య మరింత  మంచి క్రేజీ సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: