టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ , చరణ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు మంచి స్నేహితులు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే వీరిద్దరూ కలిసి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే పాన్ ఇండియా సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ తో వీరి స్నేహ బంధం మరింత బలపడింది. ఇకపోతే ఆర్ ఆర్ ఆర్ మూవీ తో వీరిద్దరి క్రేజ్ గ్లోబల్ గా పెరిగింది. ప్రస్తుతం రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తుండగా ... జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మరియు హిందీ సినిమా అయినటువంటి వార్ 2 లో హీరోగా నటిస్తున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం వీరిద్దరి సినిమాలకు సంబంధించిన ఓ కేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ కి అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కథకి మధ్య అనేక పోలికలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పోలికలు ఏమిటి అంటే గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ కనిపించనున్నాడు. ఇక తండ్రి పాత్రకు జరిగిన అన్యాయాన్ని తీర్చుకునే పాత్రలో కొడుకు కనిపించబోతున్నాడు.

అందులో భాగంగా భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే దేవర కథ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇందులో కూడా ఎన్టీఆర్ రెండు పాత్రలలో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి తండ్రి పాత్ర కాగా , మరొకటి కొడుకు పాత్ర. ఇక తండ్రికి జరిగా అన్యాయాన్ని తీర్చుకునే పాత్రలో కొడుకు అనేక పోరాటాలు చేసి వాటిలో విజయం సాధించడం ఇలా ఈ రెండు సినిమాల కథల మధ్య అనేక సంబంధాలు ఉన్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: