తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇప్పటి వరకు ఎన్నో సినిమాలను నిర్మించాడు. అందులో చాలా మూవీ లు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే చాలా కాలం క్రితం దిల్ రాజు , కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 అనే మూవీ ని నిర్మించాలి అనుకున్నాడు. ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్టు సెట్ అయింది. ఇక ఆ తర్వాత అనూహ్యంగా ఈ ప్రాజెక్టులోకి తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి లైకా సంస్థ ఎంట్రీ ఇచ్చింది.

దానితో దిల్ రాజు ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు. ఇక అనేక వాయిదాల తర్వాత ఈ మూవీ కొన్ని జూలై 12 వ విడుదల అయింది. విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఈ సినిమాకు ఘోరమైన నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకు పెద్ద స్థాయిలో కలెక్షన్లు కూడా దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే ఓ వైపు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే దిల్ రాజు సినిమాలను నిర్మించడం కాకుండా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తాడు అనే విషయం కూడా మనకు తెలిసిందే.

చాలా సినిమాలను ఈయన ఇప్పటికే డిస్టిబూట్ చేశాడు. ఏదైనా పెద్ద సినిమా విడుదల ఉంది అంటే దాదాపు నైజాం ఏరియాలో దిల్ రాజు దానిని విడుదల చేస్తూ ఉంటాడు. దానితో ఒకానొక సమయంలో భారతీయుడు 2 మూవీ ని నిర్మిద్దాం అనుకున్న దిల్ రాజు , అలాగే శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ నిర్మాత కావడంతో ఈ సినిమాను కచ్చితంగా దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేస్తాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈయన అలా చేయలేదు. ఇక సినిమా రిసల్ట్ చూశాక దిల్ రాజు కు ముందే ఈ సినిమా రిజల్ట్ తెలిసి ఉంటుంది. అందుకే ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ సైడ్ వెళ్లలేదు అనే వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: