మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో RC 16 అనే వర్కింగ్ టైటిల్ తో కొన్ని రోజుల క్రితమే ఓ మూవీ పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. కన్నడ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్ ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు.

ఇకపోతే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్మూవీ లో హీరో గా నటించనుండగా ... దర్శకత్వం వహించడం మొదటి సినిమా ఉప్పెన తోనే 100 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టిన బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందబోయే సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా కోసం బుచ్చిబాబు ఓ సెంటిమెంట్ ను ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది.

అది కానీ వర్కౌట్ అయితే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గ్యారంటీ. అసలు విషయం లోకి వెళితే ... శివరాజ్ కుమార్ తెలుగులో ఇప్పటికే బాలకృష్ణ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఆ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఆ సినిమా తర్వాత శివ రాజ్ కుమార్ తెలుగులో  RC 16 మూవీ లోనే నటించబోతున్నాడు. ఇక గౌతమీపుత్ర శాతకర్ణి సెంటిమెంట్ వర్కౌట్ అయినట్లు అయితే RC 16 కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అని రామ్ చరణ్ అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: