తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జున ఒకరు. నాగార్జున ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా నా సామి రంగ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యంగ్ బ్యూటీ ఆశకా రంగనాథ్ హీరోయిన్ గా నటించగా ... అల్లరి నరేష్ , రాజ్ తరుణ్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి విజయ్ బిన్నీ దర్శకత్వం వహించాడు.

ఈ దర్శకుడు ఈ సినిమాను దాదాపుగా సంక్రాంతి పండుగకు రెండు , మూడు నెలల ముందే ప్రారంభించాడు. కానీ పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి , పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఈ మూవీ ని ముందు చెప్పినట్లుగా సంక్రాంతి పండుగకు విడుదల చేశారు. ఇప్పటి వరకు నాగార్జున "నా సామి రంగ" సినిమా తర్వాత ఏ మూవీ ని ఓకే చేయలేదు. కాకపోతే నాగార్జున "నా సామి రంగ" సినిమా మాదిరి గానే మరోసారి ప్రయత్నం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

లేట్ అయిన పర్లేదు చాలా త్వరగా పూర్తి అయ్యే అద్భుతమైన కంటెంట్ ఉన్న స్టోరీని ఒక దానిని సెలెక్ట్ చేసి , దానిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి , మళ్లీ వచ్చే సంవత్సరం సంక్రాంతి కి తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనే ప్రయత్నాలలో నాగార్జున ఉన్నట్లు తెలుస్తోంది. మరి నా సామి రంగ సెంటిమెంట్ రిపీట్ అయినట్లు అయితే నాగార్జునకి మరో విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతుంది. ఏదేమైనా మిగతా సీనియర్ స్టార్ హీరోలు అంతా సినిమా షూటింగులతో బిజీగా ఉంటే , నాగార్జున మాత్రం తన మూవీ అప్డేట్ ఇవ్వకపోవడంతో ఆయన అభిమానులు కాస్త నిరుత్సాహంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: