సినిమా ఇండస్ట్రీలో కొన్ని సార్లు సెంటిమెంట్లు సక్సెస్ అవుతూ ఉంటాయి. కొన్ని సార్లు బ్రేక్ అవుతూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నందమూరి నట సింహం బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యొక్క చిత్రీకరణ జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఒక సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే అద్భుతమైన విజయం సాధిస్తుంది ... మరో సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంటుంది. ఆ రెండు సెంటిమెంట్లు ఏవి అనే విషయం తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో బాబి ఒకరు. ఈయన పవర్ సినిమాతో దర్శకుడుగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకుంది. ఆ తర్వాత జై లవకుశ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ తర్వాత వెంకీ మామ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు వాల్టేర్ వీరయ్య సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యింది.

ఇలా ఈ దర్శకుడు ఒక సినిమాతో హిట్ కొడితే , మరొక సినిమాతో అపజయాన్ని అందుకుంటున్నాడు. ఈ పరంగా చూసుకుంటే వాల్టేరు వీరయ్య సినిమా తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా అపజయం అయ్యే ఛాన్స్ ఉంది. ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో ఊర్వశి రౌటేలా  ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఇక NBK 109 లో ఈ ముద్దుగుమ్మ ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అవుతుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: