హీరో నాని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అలాగే రామ్ పోతినేని కూడా ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకున్నాడు. జులైలో ఇండియన్ 2 తర్వాత స్టార్ హీరోల సినిమా రిలీజ్ లు ఏమీ లేవు . అయితే, ఆగస్ట్ ఓ ఆసక్తికర చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం . ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ కొట్టిన రాం పోతినేని ఇప్పుడు డబల్ ఇష్మార్ట్ తో ఆగస్టు 15 న మన ముందుకొస్తున్నాడు .


మూవీ విడుదలకు ముందే రికార్డ్స్ ను క్రియేట్ చేసింది . ఈ మూవీ పూరి జగన్నాథ్ కి , హీరో ఇంపార్టెంట్ ఎందుకంటే ఇద్దరూ ఫ్లాప్స్ వల్ల వెనుకబడి పోయారు . ఎలా అయినా పెద్ద హిట్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు . ఇండిపెండెన్స్ డేని సెంటిమెంట్ గా నమ్ముకుని విక్రమ్ తంగలాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు . విక్రమ్ సినిమాలో హిట్ అవ్వక చాలా కాలం అవుతుంది . ఈ మూవీ తో భారీ హిట్ కొట్టి తన మార్కెట్ ను పెంచుకోవాలని కష్టపడుతున్నాడు .


నాని హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా సరిపోదా శుక్రవారం ఆగస్టు 29 న థియేటర్ లో రిలీజ్ కానుంది. ' అంటే సుందరానికి' డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా ఫ్లాప్ అవ్వగా ఇప్పుడు ఎలాగైనా హిట్ ఇవ్వాలని చాలా కష్టపడుతున్నాడు. వీరిలో ఎవరు పెద్ద హిట్ కొట్టి హీరోగా నిలబడతారో తెలియాలంటే ఇంకో నెల వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో ఏ రకంగా ఉంటాయో చూడాల్సిందే. ఈ సినిమాల్లో ఏ సినిమా హిట్టు కొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: