రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో చేస్తూ ప్రేక్షకులన్నీ బాగా కట్టుకున్నాడు. రాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్య ల ఎపిసోడ్ డైలీ సీరియల్ ల జరుగుతూనే ఉంది. రాజ్ తరుణ్ ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రా పై   నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య కేసు పెట్టిన సంగతి తెలిసిన విషయమే. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి తనను వాడుకుని వదిలేసాడనేది లావణ్య ఆరోపణ.


కాగా లావణ్య తనకు అసంబకరమైన మెసేజ్ లు పెడుతూ, తన అన్నయ్యను వేధిస్తోందని హీరోయిన్ మాల్వి  మల్హోత్ర ప్రిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో లావణ్య పై కేసు పెట్టింది. ప్రస్తుతం ఈ కేసు పోలీసులు విచారణ దశలో ఉండగా తాజాగా మరో కోణం వెలుగు చూసింది. హీరో రాజ్ తరుణ్- లావణ్య-మాల్వి మల్హోత్రా కేసుల్లో ముంబైకు చెందిన అసిస్టెంట్ ప్రోడ్యూసర్ యోగేశ్ తల్లి సంచలన వీడియో రిలీజ్ చేసింది. ప్రేమ పేరుతో తన కుమారుడిని మాల్వి మల్హోత్రా వంచించిందని, అసలు లోక్కోని తమను రోడ్డు న పడేసిందని ఆరోపించింది యోగేశ్ తల్లి.


అంతేకాదు ప్రేమ పేరుతో వెంట పడుతున్నాడని తన కుమారుడిపై కేసు పెట్టి జైలుకు పంపిదని కంటి తడి పెట్టుకుంది. యోగేష్, , మాల్వి మల్హోత్రా కలిసి తిరిగిన ఫ్లైట్ టికెట్స్, ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్, వ్యక్తిగత ఫోటోలను బయట పెడుతూ వీడియో రిలీజ్ చేసింది. తమ కుమారుడు నాలుగేళ్లగా జైల్లో ఉన్నాడని రోధిస్తుంది అసిస్టెంట్ డైరెక్టర్ యోగేశ్ తల్లి. రానున్న రోజుల్లో రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రాల కేసుల్లో ఇంకెన్ని ట్విస్టులు ఇంకెన్ని మలుపులు ఉంటాయో చూడాలి.రాజ్ తరుణ్ జీవితం ఏవిధంగా ఉంటుందో చూడాలి. వాళ్ళిద్దరూ కలుస్తారా లేదా కూడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: