నందమూరి నటసింహం బాలకృష్ణ నిజంగానే ఆ హీరోయిన్ కి కారు కొనిచ్చాడా.. ఆ హీరోయిన్ బాలకృష్ణకి అంత స్పెషలా.. నిజంగానే ఆ హీరోయిన్ బాలకృష్ణ చేత కార్ గిఫ్ట్ గా తీసుకుందా.. అనేది ఇప్పుడు చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా మంది తెలుగువారికి నందమూరి ఫ్యామిలీ అంటే సూపరిచితమే నందమూరి ఫ్యామిలీలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణనే టాప్. అయితే బాలకృష్ణ పై ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నో రూమర్స్ ఉన్నాయి. ఆయన నిర్మాత సురేష్ పై కాల్పులు జరిపారని, అలాగే కొంతమంది హీరోయిన్ల విషయంలో అసభ్యంగా ప్రవర్తించారు అనే రూమర్స్ ఉన్నాయి.

అంతేకాదు తమిళనటి విచిత్ర, నార్త్ సౌత్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాధిక ఆప్టే వంటి హీరోయిన్లు బాలకృష్ణ పేరు చెప్పకుండా ఆయనపై పరోక్షంగా క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక గత ఏడాది నటి విచిత్ర చేసిన కామెంట్స్ అయితే మీడియాలో సెన్సేషనల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే బాలకృష్ణహీరోయిన్ కి బీఎండబ్ల్యూ కార్ కొనిచ్చారంటూ అప్పట్లో ఓ వార్త తెగ చక్కర్లు కొట్టింది. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు రాజోలు బ్యూటీ అంజలి.. ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టిన రూమర్ ప్రకారం.. సౌత్ బ్యూటీ అంజలికి బాలకృష్ణ బీఎండబ్ల్యూ కార్ గిఫ్ట్ గా ఇచ్చినట్టు ఓ టాక్ వినిపించింది.

అయితే వీరిద్దరి కాంబినేషన్లో డిక్టేటర్ అనే మూవీ వచ్చింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ ఒక్క సినిమాకే అంజలికి బాలకృష్ణ కార్ గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి అని చాలామంది గుసగుసలు పెట్టుకున్నారట. అయితే ఆ రూమర్లో ఎలాంటి నిజం లేదు అని బాలకృష్ణ సన్నిహితులు కొట్టి పారేశారు. అయినప్పటికీ ఈ రూమర్ ఎందుకు చక్కర్లు కొట్టింది అనేది మాత్రం ఎవరికి అర్థం కాలేదు.
ఇక బాలకృష్ణ రీసెంట్ గా విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన సమయంలో స్టేజ్ పైన ఉన్న అంజలిని పక్కకు నెట్టేయడం, ఆయన అలా చేసినందుకు అంజలి షాకింగ్ రియాక్షన్ ఇచ్చిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే.

అంతే కాదు అంజలి నెట్టివేయడం సోషల్ మీడియాలో దుమారం సృష్టించింది. దీంతో బాలకృష్ణ తీరుని ఎంతోమంది విమర్శించారు. అలాగే అదే ఈవెంట్లో బాలకృష్ణ మద్యం సేవించారనే టాక్ కూడా వినిపించింది. బాలకృష్ణ దగ్గర ఉన్న రెండు వాటర్ బాటిల్స్ లో ఒకదాంట్లో మందు ఉన్న ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. దాంతో మద్యపానం సేవించి ఈవెంట్ కి వచ్చిన బాలకృష్ణ అలా హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ మీడియాలో దుమారం సృష్టించారు జనాలు. దాంతో అంజలి కూడా క్లారిటీ ఇచ్చి అలాంటిదేమీ లేదు బాలకృష్ణ ప్రేమతోనే అలా నెట్టేశారు. మా మధ్య మంచి అనుబంధం ఉంది అని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: