తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దూసుకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఇక్కడ తగ్గేది లేదన్నట్లుగా ముందుకు వెళ్తున్నారు. అయితే... తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యంగా... హైదరాబాద్ డ్రగ్స్ ముఠా భరతం పడుతున్నారు. వరుసగా దాడులు చేస్తూ... డ్రగ్స్ దొంగలను జైలుకు పంపిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇలాంటి నేపథ్యంలోనే టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్కు ఊహించని షాక్ తగిలింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్.. లేటెస్ట్ గా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. ఈ డ్రగ్స్ కేసులో తాజాగా  సైబరాబాద్ పోలీసులు అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నిన్నటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో రకుల్ ప్రీత్ తమ్ముడు డ్రగ్స్ కేసు గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. గతంలో రేవంత్ రెడ్డి.. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు.. రకుల్ అలాగే కేటీఆర్  గురించి చాలా విమర్శలు చేశారు.

 డ్రెస్ కేసులో ఇరుక్కున్న రకుల్ ను కేటీఆర్ మంత్రిగా ఉండి కాపాడాడని... ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు... ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులను కూడా కేటీఆర్ కాపాడాడని... కేటీఆర్ కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి అని అప్పట్లో డిమాండ్ చేశారు. ఈ తరుణంలోనే  కేటీఆర్ మరియు రేవంత్ రెడ్డి ఇద్దరు వైట్ ఛాలెంజ్ విసురుకున్నారు. ఎవరు ముందుకు రాలేదు.

 అయితే తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత..  టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతి కేసులు మాత్రం రేవంత్ రెడ్డి విడవలేదని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆమె తమ్ముడిని.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు రకుల్ ప్రీత్ సింగుకు కూడా ఈ డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నా? అసలు ఈ కేసు వెనుక ఎవరెవరు ఉన్నారు...? అనే దానిని కూడా... తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: