ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన స్టయిల్ తో మొదట స్టైల్ స్టార్ గా గుర్తింపు సాధించిన అల్లు అర్జున్ అనతికాలంలోనే ఐకాన్ స్టార్ గా పేరు గడించాడు. ఈ క్రమంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించి ఏకంగా మెగా ఫ్యామిలీని వీడి తనకంటూ ఓ ఆర్మీని సృష్టించుకున్నాడు. కాగా పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. పుష్ప సినిమా విడుదలై ఎటువంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసినదే. దాంతో పనిలో పనిగా పుష్ప ది రూల్ కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు అల్లు అర్జున్. ఆల్రెడీ చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా తరువాత మనోడు చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటనే ప్రశ్న ఇపుడు ఆయన అభిమానులను వెంటాడుతోంది.

ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఉంటుందనే ప్రచారం నడిచింది. అయితే అతను 100 కోట్ల రెమ్యునరేషన్ అడగడంతో అట్లీ అండ్ టీమ్ తిరిగి చెన్నై కి చెక్కేసిందట. దీంతో అల్లు అరవింద్ అట్లీతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఇకపోతే పుష్ప సినిమాని బీట్ చేసే స్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉండాలని అల్లు కాంపౌండ్ లో కొత్త కథలు చర్చలు జోరుగా సాగుతున్నాయని వినికిడి. అయితే ఎక్స్ పెక్ట్ చేసిన రేంజ్ లో సరైన కథలు సెట్ కావడం లేదని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక ప్రాజెక్టు ఉంటుందని టాక్ వచ్చింది. అయితే ఆ కాంబినేషన్ పై అల్లు అర్జున్ పెద్దగా ఫోకస్ చేయడం లేదని బోగట్టా.

అయితే అల్లు అర్జున్ ఇప్పటికే త్రివిక్రమ్ తో ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడని, అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని మైథాలజీ బేస్ చేసుకొని త్రివిక్రమ్ ఓ ఇంటరెస్టింగ్ స్టోరీని రెడీ చేసారని వినికిడి. ఇపుడు ఈ స్టోరీపైనే మాటల మాంత్రికుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం. ఇకపోతే అల్లు అర్జున్ కెరీర్లో మైథాలజీ బేస్డ్ క్యారెక్టర్ ని అల్లు అర్జున్ ఇంతవరకు చేయలేదు. త్రివిక్రమ్ మాత్రం పూర్తిగా మైథాలజీ బేస్డ్ కథని పీరియాడిక్ జోనర్ లోనే చెప్పబోతున్నారంట. ఈ సినిమానే బన్నీ ఆల్ మోస్ట్ సెట్స్ పైకి తీసుకొని వెళ్లే ఛాన్స్ ఉందంట. ఇక ఈ సినిమా 2025లో స్టార్ట్ చేస్తే 2027 జనవరికి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుందని టాక్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: