లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం భారతీయుడు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. భారతీయుడు సినిమా విడుదల అయిన చాలా సంవత్సరాల తర్వాత ఈ మూవీ కి కొనసాగింపుగా భారతీయుడు 2 అనే మూవీ ని అనౌన్స్ చేశారు. ఇక ఎన్నో పోస్ట్ పోన్ తర్వాత ఈ మూవీ జూలై 12 వ తేదీన భారీ ఎత్తున థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా ఏకంగా మూడు గంటలకు పైగా నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినకి బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఘోరమైన నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంలో ఈ మూవీ రన్ టైమ్ కూడా ఒక ప్రధాన కారణం అనే విమర్శలు వచ్చాయి. దానితో ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి పెద్దగా అవసరం లేని 20 నిమిషాల సన్నివేశాలను తొలగించనున్నట్లు అందుకు సంబంధించిన వర్షన్ ను మరుసటి రోజు నుండి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఈ మూవీ బృందం సినిమా విడుదల అయిన రోజు సాయంత్రం ప్రకటించింది.

ఇక దానితో ఈ సినిమా బృందం తగ్గించిన నిడివితో ఉన్న సినిమాను జూలై 13 వ తేదీ నుండి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఈ మూవీ యూనిట్ తగ్గించిన నిడివి గల చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయింది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై నెగటివ్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది. ఈ మూవీ యూనిట్ 20 నిమిషాల రన్ టైమ్ ను కూడా తగ్గించకపోవడంతో ఈ సినిమాకు మరింత కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది. మరి ఈ మూవీ యూనిట్ ఇచ్చిన మాట ప్రకారం ఈ సినిమా యొక్క రన్ టైమ్ ను తగ్గించి ఉంటే సినిమాకు ఏమైనా ప్లస్ అయి ఉండేదేమో అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: