అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది జాన్వీ కపూర్  . ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది. ఈమె తెలుగులో ఎన్టీఆర్ సరసన తంగం అనే పాత్రలో దేవర  సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.తెలుగులో ఒక్క సినిమా రిలీజ్‌ కాకుండానే జాన్వీ వరుస ప్రాజెక్ట్స్‌కి సైన్‌ చేస్తుంది. ఇప్పటికే 'దేవర', RC16 వంటి భారీ ప్రాజెక్ట్స్‌ చేస్తుంది.బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ యమ జోరు చూపిస్తుంది. హిందీలో ఆడపదడపా సినిమాలు చేసుకుంటున్న జాన్వీ.. ఏకంగా పాన్‌ ఇండియా సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా 'దేవర' మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది.ఈ మూవీ సెట్‌లో ఉండగానే రామ్‌ చరణ్‌తో మరో పాన్‌ ఇండియా మూవీ చేస్తుంది. ఇలా ఎంట్రీతోనే ఇద్దరు గ్లోబల్‌ స్టార్స్ సరసన నటించే చాన్స్‌ కొట్టేసింది జాన్వీ. దీంతో ఈ అమ్మడికి లక్క్‌ మామూలుగా లేదంటూ అంతా జాన్వీ గురించి మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోయినా.. టాలీవుడ్‌లో మాత్రం పాన్‌ ఇండియా సినిమాల ఆఫర్స్‌ కొట్టేసింది.

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ సినిమాలతో ఒక్కసారిగా టాలీవుడ్‌ సెన్సేషన్ గా నిలిచింది. తాజాగా ఈ భామ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఫిక్స్‌ అయినట్టు తెలుస్తోంది. అదే 'దసరా' కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం. న్యాచులర్‌ స్టార్‌ నాని, శ్రీకాంద్‌ ఓదెల కాంబోలో ఓ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.'నాని33'వ సినిమాగా రాబోతుంది. దసరా వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత వీరిద్దరి కాంబో వస్తున్న రెండో సినిమా ఇది. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆరీ అంచనాలు నెలకొన్నాయి. నాని కోసం శ్రీకాంత్‌ ఓదెల ఈ సినిమాను భారీగా ప్లాన్‌ చేశారట. ఈ మూవీ స్క్రిప్ట్‌ కూడా నాని బాగా నచ్చిందట. వెంటనే ఈసినిమా చేసేందుకు నాని చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. సరిపోదా శనివారం అయిపోయాగానే ఈ సినిమా పట్టాలెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. దీంతో ఈ చిత్రంలో హీరోయిన్‌ వేటలో పడిందట మూవీ టీం.ఈ క్రమంలో ఈ సినిమా జాన్వీని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే మాత్రం ఈ అమ్మడి లక్‌ మామూలుగా లేదని చెప్పాలి. వచ్చిరాగానే మూడు పెద్ద సినిమాలు, అదీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఆఫర్స్‌. దీంతో ఇక తెలుగులో జాన్వీ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయిపోతుందనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: