టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన హీరోయిన్ నయనతార వివాహమైన తర్వాత కూడా వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది.. ప్రస్తుతం కొన్ని సినిమాలు చర్చల దశలో కూడా ఉన్నవి.. దాదాపుగా పది సినిమాలు ఇమే చేతిలో ఉన్నట్లు తమిళ సినివర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.. నయనతార సినిమాల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉన్నది. ఐదు ఏళ్ల క్రితం డైరెక్టర్  సర్జన్ కేఎమ్ దర్శకత్వంలో నయనతార ఐరా అనే సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో నయనతారకు భారీ సంపాదించింది.



అయినా సినిమా తర్వాత వరుసగా లేడి ఓరియంటెడ్ చిత్రాలు చేసిన ఈమె తమిళ సినీ ప్రేక్షకుల అభిప్రాయాన్ని ఒక్కసారిగా మార్చేసింది. అలాంటి మంచి సినిమాను ఇచ్చిన డైరెక్టర్ సర్జన్ దర్శకత్వంలో ఇప్పుడు మరొక సినిమా చేయడానికి సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం భరద్వాజ్ రంగన్ స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.. ఇప్పటికే నయనతార కి ఒక స్టోరీ లైన్ చెప్పడంతో ఆమెకు నచ్చినట్లుగా తెలుస్తోంది దీంతో వెంటనే ఆమె డేట్లు కూడా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



స్క్రిప్ట్ పూర్తి అయ్యేదే ఆలస్యం సినిమా షూటింగ్ని తెరకెక్కించే విధంగా డైరెక్టర్ ప్లాన్స్ ఇస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓరివన్ సీక్వెల్ ఒకటి కాదు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రెండేళ్లలో నయనతార నుంచి ఏకంగా డజను సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే బాలీవుడ్ వైపుగా కూడా అడుగులు వేసిన నయనతార అక్కడ కూడా సరైన కథలు వస్తే చేయడానికి సిద్ధమవుతోంది. నయనతార ఒక వైపు సినిమాలు మరొకవైపు బిజినెస్ లవైపు కూడా అడుగులు వేసి బాగానే సక్సెస్ అయ్యింది. అలాగే తన భర్తతో కలిసి నిర్మాతగా కూడా పలు సినిమాలకు వ్యవహరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: