ఇక రాజమౌళి అతని సినిమా హీరోల గెటప్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాడు అందరికీ తెలిసిందే. లుక్స్, బాడీ షేప్, కాస్ట్యూమ్స్ ఎలా ఎందులోనూ కాంప్రమైజ్ కాడు. మరి ముఖ్యంగా హీరో లుక్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు జక్కన్న. ఆ లుక్ ఎలా ఉంటుందంటే ఇంతకు మునుపు సదరు హీరోని ఇంకే దర్శకుడు చూపలేని విధంగా ఉంటుంది. అందుకే సినిమా విడుదలైనంతవరకు ఆ లుక్ ని గోప్యంగా ఉంచమని హీరోలకి సూచనలు చేస్తుంటాడు.
ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. తాజాగా మహేష్ బాబు లుక్ బయటపడింది. అయితే ఇది అధికారికంగా రిలీజ్ అయినది కాదు. తాజాగా అంబానీ వివాహ వేడుకలో మహేష్ బాబు ఎలాంటి మాస్క్ ధరించకుండానే దర్శనమిచ్చాడు. దాంతో రాబోయే జక్కన్న మహేష్ బాబు సినిమాలో మన సూపర్ స్టార్ ఎలా ఉంటాడో అందరికీ తెలిసిపోయింది. దాంతో రాజమౌళి షాక్ కి గురయ్యాడు.. ఎంతవరకు జక్కన్న గత హీరోలు ఇలా జక్కన్న మోసం చేయడం చాలా అరుదు. ఈ విషయంలోనే రాజమౌళి మహేష్ బాబు పై అలకబోనట్లు ఉన్నాడని గుసగుసలు వినబడుతున్నాయి. అంతేకాకుండా మహేష్ బాబుని ఈ విషయంలో ఇక ఉపేక్షించ బోనని జక్కన్న చెప్పినట్టు విశ్వసినీ వర్గాల సమాచారం. అంతేకాకుండా మహేష్ బాడీ షేప్ విషయంలో కూడా రాజమౌళి ఇంకాస్త కసరత్తులు చేయవలసిందిగా కోరినట్టు సమాచారం.