మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో హిట్ సినిమాల్లో డాడీ సినిమా ఒకటి. 2001 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఈ మూవీకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. డాడీ మూవీలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా సిమ్రాన్ నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమాలో చిరంజీవి ఓ కూతురికి తండ్రిగా కనిపించారు. అయితే ఈ కథను రచయిత భూపతిరాజా చిరంజీవికి వినిపించినప్పుడు.. ఆయన ఈ కథకు హీరోగా వెంకటేష్ అయితే సరిగ్గా సరిపోతాడని చెప్పాడు. కానీ భూపతి రాజా మాత్రం ఇది చిరంజీవికి వెరైటీగా ఉంటుందని చెప్పి ఒప్పించాడు. సినిమా విడుదలైన తర్వాత వెంకటేష్ కూడా ఈ మూవీని చూసి చిరంజీవితో అదే అన్నారట. ఇక ఈ మూవీలో మెగాస్టార్ కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా.? డాడీ లో చిరంజీవికి, ఆ చిన్నారికి మధ్య వచ్చే సన్నివేశాల ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటాయి. 


ఇంకా అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ప్రేక్షకుల గుండెను తాకుతాయి. అయితే ఆ చిన్నారి ఎవరు.? ఇప్పుడు ఎలా ఉంది.? అని నెటిజన్స్ గూగుల్ లో ఆమె కోసం ఎంతగానో గాలిస్తున్నారు. అయితే డాడీ సినిమాలో చిరంజీవి కూతురిగా నటించిన ఆ చిన్నారి ఇప్పుడు చాలా పెద్దైపోయింది. హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా ఆమె ఎంతో అందంగా మారింది.ఇక ఆమె పేరు అనుష్క మల్హోత్రా..ముంబై కు చెందిన అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలిసిన వారి ద్వారా చిరంజీవి మూవీలో నటించే అవకాశం అందుకుందని తెలుస్తోంది. ఈ మూవీలో తన క్యూట్ క్యూట్ మాటలతో మెప్పించిన ఈ చిన్నది ఇప్పుడు గ్లామరస్ లుక్ లోకి మారిపోయింది. ఈ అమ్మడు మూవీలకు చాలా దూరంగా ఉంటుంది. చదువు పై దృష్టి పెట్టిన ఈ బ్యూటీ సినిమాల్లో ఎక్కడా కనిపించలేదు. ఇక సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండదు.అయితే ఈ చిన్నదాని ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ గా మారాయి. తన అందాలతో మతిపోగొడుతోంది ఈ బ్యూటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: