పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్  హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్  తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప’ . ఈ సినిమా నెలకొల్పిన రికార్డుల గురించి.. కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పుష్ప’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులపై చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. పుష్ప రాజ్ అనే క్యారెక్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు దర్శకుడు సుకుమార్. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్  సహకారంతో మైత్రీ మూవీస్ మేకర్స్  బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ ‘పుష్ప: ది రూల్’  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే.పుష్ప చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో అల్లుఅర్జున్ కూలి పని నుంచి సిండికేట్ నాయకుడిగా ఎదగడం ను చూపిస్తారు. ఈ చిత్రంలో రష్మికా, సునిల్, ఫాద్ ఫాజిల్, అనసూయ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పుష్ప-దిరైజ్ సీక్వెల్ పుష్ప-ది రూల్  రాబోతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే పుష్ప-2 కూడా అదే కాంబినేషన్ లో జరుగుతుంది. పుష్ప-2 మొదట ఆగష్టు-15 న విడుదల అవుతుందని చిత్ర బృందం వెల్లడించారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో మళ్లీ వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

పుష్ప-2 ఇంకా ముప్పై రోజుల షూటింగ్ పూర్తి చేయాల్సివుంది. ప్రస్తుతం చిత్రీకరణ కొంత గ్యాప్‌ ఇచ్చారు. ఈ నెలాఖరులో చిత్రీకరణ మళ్లీ షూరూ కాబోతుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఫాద్‌ ఫాసిల్ డేట్స్‌ కోసమే పుష్ప-2 యూనిట్‌ ఎదురుచూస్తున్నట్లు సమాచారం. సో.. ఈ నెలాఖరులో పహద్‌ ఫాజిల్‌ డేట్స్‌ను బట్టి పుష్ప-2 చిత్రీకరణ మళ్లీ షూరూ కాబోతుంది. ప్రస్తుతం చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతున్నాయి. అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 1000 కోట్ల బిజినెస్‌ను పుష్ప-2 పూర్తిచేసిందని అంటున్నాయి చిత్రవర్గాలు.ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో ఎర్రచందనం స్మగ్లర్ గా మాస్ లుక్ లో తన నటనను అదరగొట్టాడు. అల్లు అర్జున్ కు 69 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో` పుష్ప-ది రైజ్ `లో తన నటనకు ఉత్తమ నటుడు అవార్డు ను గెలుచుకున్నాడు అలాగే ఉత్తమ సంగీతం అవార్డ్ దేవీ శ్రీ ప్రసాద్  కి దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: