సాధారణంగా స్టార్ హీరో సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి నలుగురైదుగురు అగ్ర తారలు, వారితోపాటు సెన్సేషనల్ డైరెక్టర్స్‌తో కెమియో రోల్స్ ఉన్న సినిమాకు ఇంకెలాంటి డిమాండ్ ఉంటుంది. అలాంటి సినిమానే కల్కి 2898 ఏడీ.కల్కి 2898 ఏడీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడన్న ప్రశ్నకు తెరపడినట్లే. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ పై స్పష్టమైన తేదీ చెప్పకపోయినా.. ఇప్పట్లో మాత్రం రాదని తేలిపోయింది. ఈ మధ్యే రూ.1000 కోట్ల అరుదైన క్లబ్ లో చేరిన ఈ ప్రభాస్ మూవీ పది వారాల తర్వాతే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.ఎపిక్ బ్లాక్‌బ్లాస్టర్ అంటూ కల్కి 2898 ఏడీ మూవీ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్స్ లో ఒకటిగా ఉంది. రిలీజ్ తర్వాత మూడో వారంలోకి ఎంటరైనా ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పర్వం కొనసాగిస్తూనే ఉంది. తాజాగా రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఏడో ఇండియన్ సినిమాగానూ చరిత్ర సృష్టించింది. దీంతో అన్ని సినిమాల్లాగా ఈ మూవీని అంత త్వరగా ఓటీటీలోకి తీసుకురాకూడదని మేకర్స్ నిర్ణయించారు.

రిలీజ్ డేట్ నుంచి పది వారాల తర్వాతే ఈ  మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టనుందని స్పష్టమైంది. అంటే సెప్టెంబర్ తొలి లేదా రెండో వారంలోగానీ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ ఉండనుంది. సాధాిరణంగా ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద సినిమా అయినా నాలుగు నుంచి ఆరు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. కానీ కల్కి విషయంలో మాత్రం పది వారాల గ్యాప్ ఉండాలని నిర్ణయించారు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా రానున్నట్లు అంచనా వేస్తున్నారు.ఇక కల్కి 2898 ఏడీ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్ లలోకి వస్తుంది. హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ లో రానుండగా.. మిగతా భాషల వెర్షన్లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతాయి.ఇదిలా ఉంటే, మహాభారతంలోని కొన్ని అంశాలను స్ఫూర్తిగా తీసుకుని కల్కి 2898 ఏడీ సినిమాను తెరకెక్కించారు నాగ్ అశ్విన్. ఇందులో అశ్వత్థామ పాత్రలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటన అత్యద్భుతంగా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. సినిమాలో అమితాబ్ బచ్చన్, ప్రభాస్ మధ్య వచ్చిన యాక్షన్ సీక్వెన్స్‌కు మంచి అప్లాజ్ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: