కొంత కాలం క్రితం సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో సూరారై పోట్రు అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు లో కూడా థియేటర్ లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల చేశారు. ఈ సినిమాను తెలుగు లో ఆకాశమే నీ హద్దురా అనే పేరుతో విడుదల చేశారు. ఒకే సారి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో తమిళ్ , తెలుగు భాషలలో విడుదల అయ్యి అటు తమిళ్ , ఇటు తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ఇకపోతే ఈ మూవీ ని సుధా కొంగర హిందీ లో అక్షయ్ కుమార్ హీరో గా సర్ఫేరా అనే పేరుతో రీమిక్ చేసింది. ఇకపోతే ఈ సినిమాను జూలై 12 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ వచ్చిన కూడా పెద్దగా కలెక్షన్లు రాలేదు. ఇక మొదటి వీకెండ్ ముగిసే సరికి ఈ సినిమాకు 12.50  కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. దీనితో ప్రమోషన్ ల జోష్ ను పెంచిన ఈ మూవీ యూనిట్ సినిమాకు వచ్చినట్లు అయితే ఒక కాపీ , రెండు సమోసాలు ఫ్రీగా ఇస్తాము అంటూ ప్రమోషన్ చేయడం మొదలు పెట్టారు.

ఇకపోతే ఈ ఆఫర్ కొన్ని సెలెక్టివ్ థియేటర్ లలో మాత్రమే అని కూడా మూవీ యూనిట్ మెన్షన్ చేసింది. కాకపోతే ఈ ప్రమోషన్ కూడా ఈ మూవీ కి పెద్దగా ఉపయోగపడినట్లు లేదు. ఇక 4 వ  రోజు ఈ సినిమాకు కేవలం 1.4 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే మొత్తంగా ఈ సినిమాకు నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 14 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇలా మంచి టాక్ వచ్చినా కూడా ఈ మూవీ కి పెద్ద మొత్తంలో కలెక్షన్లు రావడం లేదు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: