కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో కార్తీ ఒకరు. కార్తీ కొంత కాలం క్రితం పీ ఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన సర్దార్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రాశి కన్నా , రాజేష విజయన్ హీరోయిన్ లుగా నటించగా ... జీ వీ ప్రకాష్ కుమార్ ఏ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ లో కార్తీ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఒక పాత్రలో స్పై ఏజెంట్ గా కనిపించగా ... మరో పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. ఈ రెండు పాత్రలలో కూడా తనదైన నటనతో ప్రేక్షకులను కార్తీ ఆకట్టుకున్నాడు. 

సినిమా 2022 అక్టోబర్ 21 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి కలెక్షన్ లను వసూలు చేసింది. సర్దార్ మూవీ విడుదల అయ్యి మంచి విజయం సాధించిన తర్వాత కొంత కాలానికి ఈ మూవీ కి కొనసాగింపుగా సర్దార్ 2 అనే మూవీ ని తెరకెక్కించనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే సర్దార్ 2 సినిమా కూడా స్టార్ట్ అయింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటనలో ఒకరు అయినటువంటి ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ రోజు ఎస్ జె సూర్య పుట్టిన రోజు కావడంతో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ జేస్తూ ఈ విషయాన్ని ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇకపోతే ప్రస్తుతం ఎస్ జె సూర్య సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు. అలా అద్భుతమైన జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఎస్ జె సూర్యమూవీ లో భాగం కానున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: