లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు 2 సినిమా భారీ అంచనాల నడుమ జూలై 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి విడుదల ఆయన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి పెద్ద మొత్తంలో కనెక్షన్ లు దక్కడం లేదు. ఇక మొదటి వీకెండ్ లో ఈ మూవీ కాస్త పరవాలేదు అనే కలెక్షన్ లను వసూలు చేసిన ఫస్ట్ వీక్ డే రోజు మాత్రం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తేలిపోయింది. ఇక ఈ మూవీ కి సంబంధించిన నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ఎప్పటి వరకు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

4 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 5.37 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.53 కోట్లు , ఉత్తరాంధ్రలో 1.40 కోట్లు , ఈస్ట్ లో 82 లక్షలు , వెస్టు లో 53 లక్షలు , గుంటూరులో 1.04 కోట్లు ,  కృష్ణ లో 81 లక్షలు , నెల్లూరు లో 43 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.93 కోట్ల షేర్ ... 19.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 24 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 13.07 కోట్ల షేర్ కలక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: