నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తర్వాత నాని , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే నాని , శ్రీకాంత్ కాంబోలో దసరా అనే సినిమా రూపొందింది. ఈ మూవీ పోయిన సంవత్సరం మంచి అంచనాల నడుమ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

సినిమా మంచి విజయం సాధించడంతో ఈ దర్శకుడికి నాని మరో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీకాంత్ , నాని సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే నాని హీరోగా రూపొందబోయే సినిమాలో హీరోయిన్ గా కూడా ఒక బ్యూటీ ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ దర్శకుడు నాని హీరోగా రూపొందబోయే సినిమాలో జాన్వి కపూర్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ దర్శకుడు ఈమెకు స్టోరీని వినిపించగా , ఆ కథ బాగా నచ్చడంతో నాని హీరోగా శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందుబోయే సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఈ బ్యూటీ గ్రీన్స్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ప్రస్తుతం జాన్వీ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే రామ్ చరణ్ , బుచ్చిబాబు కాంబోలో రూపొందబోయే సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇక ఈమెకు బాలీవుడ్ లో అద్భుతమైన క్రేజ్ ఉంది. దీనితో నాని సినిమాలో కనుక ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా ఓకే అయితే నార్త్ లో నానికి ఫుల్ గా క్రేజ్ పెరిగే అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: