మీడియం రేంజ్ హీరోలలో విభిన్నమైన సినిమాలను చేయాలని నాని ప్రయత్నిస్తూ ఉంటాడు. వీలైనంతవరకు రొటీన్ కథలకు భిన్నంగా అతడి సినిమాలు ఉంటాయి. 100 కోట్ల హీరోగా మారాలని నాని కల ‘దసరా’ తీర్చింది కానీ ఆతరువాత వచ్చిన ‘హాయ్ నాన్నా’ నానీకి నిరాశను మిగిల్చింది. దీనితో ఎలర్ట్ అయిన నాని తన సినిమా కథల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.



ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు మంచి అభిరుచి గల నిర్మాతగా మారాలని గట్టి ప్రయత్నాలు చేస్తూ ‘వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై డిఫరెంట్ సినిమాలను చాల దైర్యంగా తీస్తున్నాడు. ‘హానుమాన్’ మూవీతో టాప్ దర్శకుడుగా మారిపోయిన ప్రశాంత్ వర్మ టాలెంట్ ను గుర్తించి అతడిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది నానీ మాత్రమే.



ఆతరువాత శైలేష్ కొలనుని కూడ ఇండస్ట్రీకి పరిచయంచేసి అతడితో ‘హిట్’ సినిమాను సినిమాను తీసిన విషయం తెలిసిందే. ఆతరువాత దర్శకుడు అడవి శేషు వెంకటేష్ సినిమాలు తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ దర్శకుడు నానీతో ‘హిట్ 3’ తీయబోతున్నాడు. ఈమూవీ పై ప్రారంభంకాకుండానే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగానే నాని మరో సాహసం చేయబోతున్నాడు.



జగదీష్ అనే కొత్త దర్శకుడుని నాని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు. ఈమూవీని కూడ నాని తన సొంత బేనర్ పై నిర్మించబోతున్నాడు. లేటెస్ట్ గా హైదరాబాద్ లో జరిగిన డార్లింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా వచ్చిన నాని మాట్లాడుతూ తన కొత్త మూవీ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. ఇండస్ట్రీకి మరొక టాలెంటెడ్ దర్శకుడుని పరిచయం చేస్తున్నానని ఇక రానున్నరోజులలో అందరు తాను పరిచయం చేయబోయే జగదీష్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు అని చెపుతూ తన మూవీ పై అంచనాలు పెంచుతున్నాడు. ఇండస్ట్రీకి కొత్త దర్శకులు పరిచయం అవుతున్న పరిస్థితుల్లో జగదీష్ నాని ఇచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగ పరుచుకుంటాడో చూడాలి..






మరింత సమాచారం తెలుసుకోండి: