గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ తన నటన కంటే నడుముతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన సన్నని నడుముకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక ఈ బ్యూటీ తన నటన, అందం, అభినయం, నడుము, ఒంపు సొంపులతో కుర్రకారు మనసును దోచుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకానొక సమయంలో తన హవాను కొనసాగించింది. దాదాపు ఈ బ్యూటీ 15 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా రాణించింది. అగ్ర హీరోల సరసన నటించి ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఇక ఈ బ్యూటీ కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.


సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ఇలియానా రెండుసార్లు ప్రేమలో పడి విఫలమైంది. ఇక ఈ మధ్యకాలంలోనే ఇలియానా పెళ్లి చేసుకోకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ బిడ్డకు తండ్రి ఎవరో కూడా తాజాగా ఈ మధ్య కాలంలోనే రివీల్ చేసింది. ప్రస్తుతం ఇలియానా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఇలియానా సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ.... తన పూర్తి సమయాన్ని తన బిడ్డతోనే గడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.



ఇక ఈ మధ్యకాలంలోనే ఇలియానా తన ఫాలోవర్లతో కాసేపు ముచ్చటించింది. అంతేకాకుండా నెటిజెన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. బాబు ఉన్నాడు కదా రాత్రి సమయాల్లో నిద్ర ఉంటుందా? మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడు వస్తారు? మీరు ఇండియాను మిస్ అవుతున్నారా? ఎక్కువగా బీచుల్లోనే సమయాన్ని గడుపుతూ కనిపిస్తున్నారు ఎందుకు? అంటూ ఇలా చాలామంది నెటిజెన్లు పలు రకాలుగా ప్రశ్నలు వేశారు. ఇక ఆ ప్రశ్నలకు ఇలియానా నిద్ర చాలా కరువైంది అన్నట్లుగా చెప్పుకొచ్చింది.



మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా తెలియజేసింది ఇలియానా. అంతేకాకుండా ప్రస్తుతం సినిమాల్లో నటించాలనే ఆలోచన లేనట్లుగా.... పూర్తిగా తన బిడ్డ కోసమే సమయం కేటాయించాలని అనుకుంటున్నట్టుగా తెలియజేసింది. అంతేకాకుండా సరైన సమయం వచ్చినప్పుడు మళ్ళీ సినిమాల్లో నటిస్తానని చెప్పుకొచ్చింది. ఇక ఇలియానా సినిమాల్లో మళ్లీ నటించదని తెలిసి తన అభిమానులు చాలా బాధపడుతున్నారు. ప్రస్తుతం ఇలియానా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: