కొన్ని రోజుల క్రితమే మన దేశంలో దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే . ఇక ఈ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీ జే పీ) మాకు కచ్చితంగా 400 పైగా ఎంపి స్థానాలు రాబోతున్నాయి అంటూ గట్టిగా ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు . ఇక వీరు అంత గట్టిగా 400 పార్లమెంటు స్థానాలు దక్కించుకుంటాము అని చెబుతున్నారు అంటే కచ్చితంగా 300 కు పైగా పార్లమెంటు స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది అని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ రిజల్ట్ మాత్రం వీరికి దిమ్మ తిరిగిపోయే షాక్ ను ఇచ్చింది.

పార్టీ అనుకున్న స్థానాలు రాలేదు కదా కనీసం ఈ పార్టీకి 300 కు దగ్గర పార్లమెంటు స్థానాలు కూడా రాలేదు. ఏకంగా 240 పార్లమెంటు స్థానాలు మాత్రమే వచ్చాయి. కొంచెం అటు ఇటు అయితే అధికారమే పోయేలాంటి పరిస్థితి ఏర్పడింది. దీనితో బి జె పి అధిష్టానంతో పాటు గ్రౌండ్ లెవెల్ లో కూడా చర్చ మొదలైంది. అసలు ఇలాంటి రిజల్ట్ ఎందుకు వచ్చింది. మనం అనుకున్న స్థాయిలో ఎంపీ స్థానాలు రాకపోయినా కనీసం దానికి దగ్గర స్థాయిలో అయినా రాలేదు కదా.

అంతా కూడా ఎందుకు రాలేదు అనే ఆలోచనలో పడిపోయారు. ఇకపోతే తాజాగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తాజాగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ప్రకారం విదేశీ శక్తుల కుట్ర వల్లే బి జె పి కి సీట్లు తగ్గాయి అని లేకపోయి ఉంటే భారీ మొత్తంలో సీట్లు భారతీయ జనతా పార్టీ కి వచ్చేవి అని ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక తాజాగా ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp