![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/rayan-movie-trailer-c363a2d4-9c0a-4e24-94a7-bbb3d47818f8-415x250.jpg)
రాయన్ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే ఈ చిత్రంలో రాయన్ పాత్రలో పూర్తిగా ధనుష్ మాస్ హీరోగా కనిపిస్తున్నట్లు ఈ ట్రైలర్ లో చూస్తే కనిపిస్తోంది. 50వ సినిమా కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సినిమాని తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎస్ జె సూర్య, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్ ,ప్రకాష్ రాజ్ తదితరులు సైతం నటిస్తూ ఉన్నారు. రాయన్ ట్రైలర్ కి సంబంధించి గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒక బాలుడు క్రూరంగా ఎలా మారుతారు అనే విషయాన్ని ఈ సినిమా ట్రైలర్లో చూపించారు.ఆ అబ్బాయి ఆలా మార్పుకి గల కారణాలు ఏంటో తెలియాలి అంటే సినిమాను చూడాల్సిందే.
రాయన్ సినిమా జులై 26న విడుదల కాబోతోంది. సినిమా క్వాలిటీ ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సన్ పిక్చర్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని తెలుగు ,తమిళ్, హిందీ వంటి భాషలలో విడుదల చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తూ ఉంటారు. 2024లో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మరొకసారి రాయన్ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఇందులో ధనుష్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా కనిపిస్తోంది. ప్రస్తుతం రాయల్ ట్రైలర్ అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది.