మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా రోజుల క్రితమే ఉప్పెన సినిమా దర్శకుడు అయినటువంటి బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. కాకపోతే ఈ సినిమా షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాకపోవడానికి ప్రధాన కారణం. రామ్ చరణ్ ఇన్ని రోజుల పాటు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజెర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.

సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యాకే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో రమ్య చరణ్ ఇన్ని రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ ను హోల్డ్ లో పెట్టాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే గేమ్ చేంజర్ మూవీ లో రామ్ చరణ్ కు సంబంధించిన పోర్షన్ షూటింగ్ కంప్లీట్ అయింది. దానితో మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ కి ఇప్పటి వరకు టైటిల్ ఫిక్స్ చేయలేదు. దానితో RC 16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ కి సంబంధించిన పనులను పూర్తి చేస్తూ వస్తున్నారు.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు , ఆల్మోస్ట్ ఇదే టైటిల్ కన్ఫామ్ చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి ఇప్పటి వరకు ఎలాంటి టైటిల్ ను అనుకోలేదు అని , సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ కథ కి తగ్గట్లు ఏదైనా మంచి టైటిల్ దొరికితే దానిని పెట్టబోతున్నట్లు , ఒక వేళ సినిమా చిత్రీకరణ దశలో ఏ టైటిల్ కూడా బెటర్ గా అనిపించని దశలో పెద్ది అనే టైటిల్ ను ఆలోచించే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: