సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ శాతం విజయాలు ఉన్న వారికి అవకాశాలు వస్తూ ఉంటాయి. అందం , అభినయం , టాలెంట్ అని ఉండి కూడా విజయాలు లేనట్లు అయితే అలాంటి వారికి అవకాశాలు పెద్దగా రావు. అదే నటన పెద్దగా రాకపోయిన విజయాలు వరుసగా దక్కినట్లు అయితే అలాంటి వారికి సినిమా ఇండస్ట్రీలలో అవకాశాలకు కొదువే ఉండదు. ఇకపోతే కొంత మంది కి మాత్రమే నటించిన మొదటి సినిమా కూడా విడుదల కాకుండానే వరుస అవకాశాలు దక్కుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం తెలుగులో అలా ఇద్దరు బ్యూటీలు కెరీర్లు ముందుకు సాగిస్తున్నారు వారు ఎవరో తెలుసుకుందాం.

బాలీవుడ్ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టిన జాన్వి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర సినిమాలు హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే ఈమెకు రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో సినిమా అవకాశం వచ్చింది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇకపోతే నాని , శ్రీకాంత్ ఓదల కాంబోలో ఓ మూవీ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే.

మూవీ లో కూడా ఈ ముద్దుగుమ్మకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే మూవీ రూపొందుతుంది. ఇందులో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తోనే ఈమె తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ సినిమా విడుదల కాకముందే ఈమెకు దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ మూవీలోను , విజయ్ దేవరకొండ హీరోగా మరో మూవీలోని అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది. ఇలా ఈ ఇద్దరు బ్యూటీలు తెలుగులో నటించిన మొదటి సినిమా కూడా విడుదల కాకుండానే వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: