తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన యువ నటులలో రామ్ పోతినేని ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా ఈ నటుడు డబల్ ఈస్మార్ట్ అనే మూవీ లో హీరోగా నటించాడు. కావ్య ద్వాపర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టైర్ 2 హీరోలలో ఇప్పటి వరకు అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాలలో మొదటి స్థానంలో 90 కోట్లతో లైగర్ మూవీ నిలవగా రెండవ స్థానంలో డబల్ ఈస్మార్ట్ మూవీ నిలిచింది. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని కొంత కాలం క్రితం ది వారియర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ టైర్ 2 హీరోలలో అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న సినిమాల లిస్ట్ లో 8 వ స్థానంలో ఉంది.

ఇకపోతే ఆఖరుగా రామ్ పోతినేని "స్కంద" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ టైర్ 2 హీరోలలో అత్యధిక ప్రీ జరుపుకున్న సినిమాలలో 5 వ స్థానంలో ఉంది. ఇక ఇప్పటివరకు రామ్ కెరియర్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇక డబుల్ ఈస్మార్ట్ సినిమా ఏకంగా 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. మరి ఈ సినిమా అయినా రామ్ కి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: