యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొన్ వంటి సూపర్ స్టార్స్ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898ఏడి' సినిమా ఇప్పటికే రూ. 1000 కోట్ల మార్క్ ను కూడా చాలా ఈజీగా దాటేసింది. కేవలం 2 వారాల్లోనే 1000 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిపోయింది కల్కి 2898 ఎడి. మహా భారతం రిఫరెన్స్ తో కల్కి 2898ఏడీ చిత్రాన్ని కంప్లీట్ ఫిక్షనల్ వరల్డ్ లో చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.  600+ కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు సీనియర్ నిర్మాత అశ్వినిదత్.ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే లాంటి స్టార్ చరిష్మా కారణంగా ఈ సినిమాకి విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది.  మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ మిక్స్ స్టోరీ, స్టార్ కాంబినేషన్ కారణంగా ఈ సినిమాకి మొదటి రోజు 190+ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది.ఇప్పటిదాకా ఈ సినిమాకి పోటీగా మరి ఏ ఇతర సినిమాలు లేవు. 


అందువల్ల ప్రేక్షకులు కల్కి మూవీ చూడటానికి విపరీతంగా ఆసక్తి చూపించారు. చూపిస్తున్నారు కూడా.370 కోట్ల భారీ బిజినెస్ జరుపుకొని 371 టార్గెట్ తో కల్కి మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. అయితే సినిమాలని థియేటర్ లో చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించని ఇలాంటి సమయంలో 370 కోట్లు అంటే చాలా పెద్ద నెంబర్ గానే కనిపించింది. కానీ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల స్పందన చూసి ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ చాలా చిన్నదైపోయింది. దీంతో కేవలం 10 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇప్పటి వరకు ఈ మూవీకి 150 కోట్ల దాకా ప్రాఫిట్ వచ్చిందని సమాచారం తెలుస్తుంది. ఇప్పటిదాకా ఈ సినిమా 1040 కోట్ల గ్రాస్, 520 కోట్ల షేర్ వచ్చింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమాల జాబితాలో కల్కి 2898ఏడీ మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో బాహుబలి 2 ఉండగా, రెండో స్థానంలో హనుమాన్ మూవీ ఉంది.అయితే ప్రస్తుతం థియేటర్స్ లో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఇండియన్ 2 సినిమా ఆడియన్స్ ని మెప్పించలేదు. అందుకే ఇప్పటికీ కూడా కల్కికి మంచి కలెక్షన్స్ వస్తూ ఉన్నాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: