తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ప్రియదర్శి ఒకరు. ఈయన పెళ్లి చూపులు అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో కమెడియన్ పాత్రలో నటించిన ప్రియదర్శి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఈయనకు వరుసగా అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం ఈ నటుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ప్రియదర్శి "డార్లింగ్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో నబా నటేష్ హీరోయిన్ గా నటించింది  ఈ సినిమాను జూలై 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు తాజాగా భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇకపోతే ఈ ఈవెంట్ లో భాగంగా ప్రియదర్శి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. డార్లింగ్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ప్రియదర్శి మాట్లాడుతూ ... చిన్న తనంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తే పెరిగాను. ఆయనను చూసినప్పుడల్లా సినిమా ఇండస్ట్రీ కి వెళ్లాలి హీరో అవ్వాలి అనే ఆలోచన వస్తూ ఉండేది. ఆయన ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీ కి వచ్చాను.

ఇక ఇండస్ట్రీ కి వచ్చాక నాని ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. ఎందుకు అంటే ఆ తరంలో మెగాస్టార్ చిరంజీవి ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చే అద్భుతమైన స్థాయికి ఎదిగాడు. ఈ సమయంలో ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లో మంచి స్థానంలో కొనసాగుతున్న వారిలో నాని ఒకరు. అందుకే ఇండస్ట్రీ లోకి వచ్చే ముందు మెగాస్టార్ చిరంజీవి ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. వచ్చాక నాని ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కెరియర్ ను కొనసాగిస్తున్నాను అని ఈ ఇద్దరు హీరోలపై ప్రియదర్శి "డార్లింగ్" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా పొగడ్తల వర్షం కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: