పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే మూవీ ని మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. ఈ మూవీ షూటింగ్ చాలా డిలే అవుతూ ఉండడంతో క్రష్సినిమా దర్శకత్వ బాధ్యతలు నుండి తప్పుకున్నాడు. దానితో కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన రూల్స్ రంజాన్ సినిమాకు దర్శకత్వం వహించిన జ్యోతి కృష్ణ ఈ మూవీ యొక్క దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు.

సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించకపోయిన చాలా సార్లు ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలు మేకర్స్ ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మొదట ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తేదీ వరకు ఈ సినిమాకు సంబంధించిన పనులు చాలా పెండింగ్ ఉండే అవకాశం ఉండడంతో ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పటికే పుష్ప డిసెంబర్ నెలలో విడుదల కాపడం కన్ఫామ్ అయిపోయింది.

ఒక వేళ చాలా వార్తలు వస్తున్నట్లు హరిహర వీరమల్లు సినిమాను కూడా ఈ సంవత్సరం డిసెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినట్లు అయితే పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పోరే జరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ రెండు సినిమాలు ఒకే నెలలో విడుదల అవుతాయా ..? లేక చాలా గ్యాప్ తీసుకొని విడుదల అవుతాయి అనేది చూడాలి. హరిహర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: