రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో పట్టుబడడంతో ఈయన దగ్గర నుండి డ్రగ్స్ తీసుకున్న ఎంతోమంది సినీ,రాజకీయ ప్రముఖులు టెన్షన్ లో మునిగిపోయారు.ఎప్పుడు ఎవరి పేరు పోలీసులు బయటపెడతారో తెలియక తెగ భయపడి పోతున్నారట.ఈ నేపథ్యంలోనే రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు లవర్ కూడా టెన్షన్ లో ఉందని తెలుస్తోంది. మరి ఇంతకీ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు ప్రియురాలు ఎవరు? ఎందుకు టెన్షన్ పడుతుంది అనేది ఇప్పుడు చూద్దాం.. రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ అక్క బాటలోనే ఇండస్ట్రీ లోకి వచ్చి కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి హిట్టు కాలేదు. దాంతో రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన పలు వ్యాపారాలు చూసుకుంటున్నారు.అలాగే ఈయన హైదరాబాదులో ఉన్న జిమ్ సెంటర్ ని కూడా రన్ చేస్తారు.అయితే గత కొద్ది రోజులుగా అమన్ ప్రీత్ సింగ్ ఓ టాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారట.

ఇక ఆమె ఎవరయ్యా అంటే.. రన్ రాజా రన్ మూవీ తో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన సీరత్ కపూర్.శర్వానంద్ హీరోగా చేసిన రన్ రాజా రన్ మూవీలో సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టుకోవడంతో సీరత్ కపూర్ కి మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ తర్వాత ఈమె ఎక్కువ సినిమాల్లో రాణించలేకపోయింది. అలా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వస్తుంది. సీరత్ కపూర్ మనమే,టచ్ చేసి చూడు,భూమా కలాపం,రాజుగారిగది వంటి కొన్ని సినిమాల్లో నటించింది. అయితే గత కొద్ది రోజులుగా సీరత్ కపూర్ అమన్ ప్రీత్ సింగ్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని, ప్రస్తుతం వీరిద్దరూ సహజీవ** చేస్తున్నారంటూ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ తన తమ్ముడు, భర్తతో కలిసి వెళ్ళిన ప్రతి వెకేషన్ లో సీరత్ కపూర్ కూడా ఉంటుంది.

అలాగే రకుల్ పెళ్లిలో కూడా ఈ హీరోయిన్ సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే అమన్ ప్రీత్ సింగ్,సీరత్ కపూర్ మధ్య బంధం ఏర్పడింది ఆవోనా మ్యూజిక్ అనే ఆల్బమ్ చేసే సమయంలో.. అప్పటినుండి వీరిద్దరూ తమ రిలేషన్ ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అయితే సడన్గా అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో దొరకడంతో ఈ వ్యవహారం తన మీదికి ఏమైనా తిరుగుతుంది ఏమో అని అనుకుందో ఏమో తెలియదు కానీ సీరత్ కపూర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సీరత్ కపూర్ ప్రస్తుతం  ప్రియుడి అరెస్టుతో టెన్షన్ పడుతున్నట్టు సమాచారం.అయితే అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో దొరకడంతో ఆయనకు సంబంధించిన కొంతమందిని కూడా విచారించాలి అనుకుంటున్నారట పోలీసులు.అందులో రకుల్ ప్రీత్ సింగ్, సీరత్ కపూర్ వంటి వారిని కూడా విచారించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: