నటసింహం నందమూరి బాలకృష్ణ  యాక్షన్ చిత్రాల దర్శకుడు బాబీ తొలి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో “వాల్తేర్ వీరయ్య” తెరకెక్కించి బ్లాక్‌బస్టర్‌ అందుకున్న నేపథ్యంలో బాలయ్య, బాబీ మూవీ పట్టాలెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది.కెరీర్ లో బాలయ్యకు ఇది 109వ చిత్రం.ప్రస్తుతం ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ‘వీర మాస్‌’ అనే టైటిల్‌ని పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ మాస్ కు కేరాఫ్ అడ్రస్. కాబట్టి ఈ టైటిల్ అతడి ఇమేజ్ కు బాగా సరిపోతుందని దర్శకుడు నమ్ముతున్నాడు.అయితే ఇలాంటి టైటిల్స్‌ను ఆయన అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. చాలా ఓల్డ్ స్టయిల్ లో టైటిల్ ఉందని, ఇలాంటి టైటిల్స్ నుంచి దూరంగా జరగాలని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించొద్దని ఈ చిత్ర నిర్మాత నాగవంశీని డిమాండ్ చేస్తున్నారు.భగవంత్ కేసరి లాంటి సినిమా హిట్ తర్వాత బాలకృష్ణ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే మరి ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది.ఇంకా క్లాసిక్ టచ్ ఉన్న మాస్ టైటిల్ అయితే బాగుంటుంది కానీ ఇలాంటి టైటిల్ అయితే జనానికి ఎక్కువగా కనెక్ట్ కాకపోవచ్చు అని వారు అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉంటే సినీయర్ హీరోల్లో బాలకృష్ణ ఓ అరుదైన రికార్డ్ నమోదు చేశారు. వరుసగా తన మూడు సినిమాలు అమెరికాలో వన్ మిలియన్ డాలర్స్ సాధించి అదరొట్టాయి. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి, ఇక లేటెస్ట్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగతవంత్ కేసరి.. ఈ మూడు సినిమాలు వరుసగా అమెరికాలో వన్ మిలియన్ డాలర్స్ వసూలు చేసి వావ్ అనిపించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: