లోక నాయకుడు కమల్ హాసన్ కొన్ని రోజుల క్రితమే ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD అనే సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఆ కాస్త సమయం లోనే ఈయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇకపోతే ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో తాజాగా కమల్ హాసన్ ఓ వీడియోను విడుదల చేశాడు.

ఆ వీడియోలో భాగంగా కల్కి సినిమా భారీ విజయం పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. తాజాగా కమల్ హాసన్ విడుదల చేసిన వీడియోలో భాగంగా మాట్లాడుతూ ... వరుసగా అనేక ఫోన్లు వస్తున్నాయి. కెరియర్ లో దాదాపు ఇప్పటి వరకు 250 సినిమాలు చేశాను. కానీ ఈ సినిమా చాలా స్పెషల్. ఈ మూవీ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని అనుకోలేదు. కల్కి మూవీ బ్లాక్ బాస్టర్ హిట్. కలెక్షన్లు కూడా చాలా పెరుగుతున్నాయి అని తాజాగా కమల్ హాసన్ విడుదల చేసిన వీడియోలో మాట్లాడాడు.

ఇకపోతే జూలై 12క్వ తేదీన కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు 2 సినిమా విడుదల అయింది. ఈ మూవీ భారతీయుడు మూవీ కి కొనసాగింపుగా రూపొందడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలం అయింది. ఇకపోతే ఈ సినిమాలో సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియ భవాని శంకర్ , సముద్ర ఖని , బాబి సింహ ముఖ్య పాత్రలలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. లైకా ప్రొడక్షన్స్ , రెడ్ గ్లాంట్ సంస్థల వారు సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: