టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' 2021 డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ బ్లాక్ బస్టర్ మూవీ విడుదలై మూడేళ్లు గడుస్తోంది.దీంతో ఈ మూవీ సీక్వెల్ పుష్ప 2: ది రూల్ రిలీజ్ కోసం అల్లు అర్జున్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం చాలా ఆలస్యమవుతోంది. దీంతో పుష్ప 2 సినిమా రిలీజ్ పై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ వేరే మూవీలు కూడా చేయడం లేదు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఆగస్ట్ 15న పుష్ప 2 సినిమా విడుదలయ్యేది. అయితే ఈ మూవీ విడుదల తేదీని డిసెంబర్‌కి మార్చారు. అయితే ఇప్పుడు డిసెంబర్ నెలలో పుష్ప సీక్వెల్ రావడం కష్టమని వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదే పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నరని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు పుష్ప 2 సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. అలాగే అల్లు అర్జున్ కూడా క్లీన్ షేవ్ చేసుకుని తన కుటుంబంతో కలిసి యూరప్‌కు విహారయాత్రకు వెళ్లాడు. 


మరోవైపు దర్శకుడు సుకుమార్ కూడా అమెరికా వెళ్లిపోయాడు. దీంతో షూటింగ్ మరింత ఆలస్యమవుతోందని సమాచారం తెలుస్తోంది.పుష్ప 2 మూవీలో , అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇంకా అలాగే అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేష్, డాలీ ధనంజయ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు, ఒక టీజర్ ను విడుదల చేశారు. వీటికి అభిమానుల నుంచి సూపర్ స్పందన వస్తోంది. ఇక పుష్ప 2 పాటలు యూట్యూబ్ లో కూడా రికార్డులు కొల్లగొడుతున్నాయి. దీంతో పుష్ప 2 రిలీజ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఇంతకు ముందు ప్రకటించినట్లుగానే డిసెంబర్ 6నే పుష్ప 2 రిలీజ్ అవుతుందా? లేక వచ్చే ఏడాదికి వాయిదా పడనుందా? అన్నది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ప్రతిష్ఠాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పుష్ప 2 మూవీని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: