టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన క్యూట్ మాటలతో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో, అల్లరి, అందం కలగలిసిన ఈ చిన్నది ఎన్నో సినిమాల్లో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 12 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తన హవాను కొనసాగించింది. ఇక ఈ మధ్యకాలంలో సమంతకు కాస్త ఫ్లాప్ టాక్ వస్తోంది. సమంత టాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా నటించడం లేదు.


తన పూర్తి ధ్యాసను బాలీవుడ్ ఇండస్ట్రీపైనే పెట్టింది. ఇదిలా ఉండగా.... సమంత అక్కినేని నాగచైతన్యను ప్రేమించి.... కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరు నాలుగేళ్ల పాటు కలిసి వారి వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడిపారు. ఆ తర్వాత ఏవో కొన్ని మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు. విడాకుల అనంతరం ఎవరికివారు వారి పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే విడాకుల అనంతరం నాగచైతన్య హీరోయిన్ శోభితతో రిలేషన్ కొనసాగిస్తున్నాడని ఎన్నో రోజుల నుంచి వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.


దీనికి తగినట్టుగానే వీరిద్దరూ పలుమార్లు కలిసి కెమెరా కంటపడ్డారు. దీంతో నాగచైతన్య, శోభిత డేటింగ్ లో ఉన్నారని వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ ఈ వార్తలపై ఇప్పటివరకు వీరిద్దరూ స్పందించలేదు.... అలా అని ఆ వార్తల్లో నిజం లేదని కొట్టి పారేయలేదు. ఈ విషయం తెలిసి సమంత ఎంతో బాధపడిందని తన స్నేహితురాలు చెప్పడం జరిగింది. ఇక సమంత సోషల్ మీడియాకు చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు టచ్ లో ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది.


ఈ క్రమంలోనే సమంత ఈ మధ్యన కాస్త గ్లామర్ డోస్ పెంచింది. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇస్తోంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి యూత్ ను ఆకట్టుకుంటుంది. అయితే ఎప్పుడూ లేనివిధంగా సమంత ఇలా ఎందుకు చేస్తుంది అని చాలామంది ఆరా తీయగా..... నాగచైతన్య, శోభిత డేటింగ్ వార్తల కారణంగానే సమంత ఇలా చేస్తుందని.... అందుకే గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: