తెలుగు వాళ్ళందరి డార్లింగ్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా గురించి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. నాగ అశ్విన్ దర్శకత్వంలో, వైజయంతి మూవీస్ బ్యానర్ పైన తెరకెక్కిన కల్కి సినిమా ఎటువంటి ప్రభంజనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా 1000 కోట్ల మేర వసూళ్లు రాబట్టి... తన వసూళ్ల పరంపరను ఇంకా కొనసాగిస్తుంది. మరీ ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అయితే ఈ సినిమాను ఒకటికి రెండుసార్లు చూస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. బాహుబలి సినిమాతో ప్రభాస్ ఏకంగా ఫ్యాన్ ఇండియా స్టార్ అయి, భాషతో తేడా లేకుండా జనాల గుండెల్లో స్థానం దక్కించుకున్నాడు. అందుకే ప్రభాస్ సినిమాలకు భారీ వసూళ్లు వస్తుంటాయి. ఈ క్రమంలోనే నిర్మాతలు వందల కోట్ల డబ్బుని వీరు సినిమా కోసం వెచ్చిస్తూ ఉంటారు. గతంలో రిలీజ్ అయిన సలార్ సినిమా 600 కోట్ల మేర వసూలు సాధించిందనే సంగతి అందరికీ తెలిసిందే.

ఇక అసలు విషయంలోకి వెళితే... నాగ అశ్విన్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ అందరికీ పిచ్చపిచ్చగా నచ్చేసింది. మొదటి భాగం భారీ హిట్ కావడంతో నాగ్ అశ్విన్ రెండో భాగం పైన కాన్సెంట్రేట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను థియేటర్లో చూసినవారు ఓ ప్రత్యేకమైన ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్ కలిగిందంటూ చెప్పుకొచ్చిన సంగతి మీరు వినే ఉంటారు.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ఓటిటిలో కూడా చూసి తరిద్దామని అనేకమంది సినిమా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో కల్కి సినిమా తమ ఇంట్లోకే వస్తుందని నమ్మిన సినిమా ప్రేక్షకులకు వైజయంతి మూవీస్ వారు ఓ చేదు వార్తని అందించారు. విషయం ఏమిటంటే... కల్కి సినిమా ఓటీటీలోకి రావాలంటే మరో 10 వారాలు వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవును కల్కి సినిమా రైట్స్ ఓటిటి వారికి పది వారాలు తరువాతే అమ్ముతామని వైజయంతి మూవీస్ వారు తెగేసి చెప్పారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: