మెగాస్టార్ చిరంజీవి, స్టార్ క్రికెటర్ కోహ్లీ గురించి జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకరు సినిమా రంగంలో సూపర్ స్టార్ అయితే, మరొకరు క్రీడారంగంలో వెలుగుందుతున్న రారాజు. కాబట్టి ఈ ఇద్దరు గురించి ప్రత్యేకమైన పరిచయం చేయాల్సిన పనిలేదు. అయితే సినిమాలు, క్రీడారంగం అనేవి భిన్నమైన అంశాలు. అయితే ఎక్కడో ఈ రెండిటికీ మధ్య అవినాభావ సంబంధం అనేది ఒకటి ఉంటుంది. అందుకే అడపాదడపా క్రికెట్ స్టార్లు, సినిమా స్టార్లు ఒకే వేదిక పైన తారసపడుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే మన టాలీవుడ్ సినిమా హీరోలు ఓ గుంపుగా ఏర్పడి వేరొక సినిమా రంగానికి చెందిన వ్యక్తులతో క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇక అసలు విషయంలోకి వెళితే... మన మెగాస్టార్ పాటలు అంటే కోహ్లీకి చచ్చేంత ఇష్టమట. మరీ ముఖ్యంగా మన చిరు డాన్స్ అంటే కోహ్లీ పడి చస్తాడని తన సహా ఆటగాడు ద్వారకా రవితేజ తాజాగా ఓ మీడియా వేదికపై మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. విషయం ఏంటంటే వీరిద్దరూ అండర్ 15 ఆడినప్పుడు ఎటువంటి విషయాలు ఎక్కువగా చర్చించుకునేవారట. రవితేజ బ్రేక్ టైం లో చిరంజీవి పాటలు పెడితే వాటిని వినడానికి, డాన్సులు చేయడానికి కోహ్లీ చాలా ఆసక్తి చూపే వాడట. అది మాత్రమే కాదండోయ్... చిరంజీవి పాటలు ఇంకా ఏమేమి ఉన్నాయో అడిగి తెలుసుకుని మరి కోహ్లీ తన మొబైల్ స్పేస్ లో వాటికి స్థానం కల్పించే వాడంట.

తప్పదు మరి... ఎంతటి వారలైనా మెగాస్టార్ దాసులే మరి. మెగాస్టార్ అంటే ఒక తెలుగుకే పరిమితం కాదు. యావత్ ఇండియాలో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు లేరు అనేది నగ్నసత్యం. ఒకప్పటి స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ఓ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ... తన ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు. నేటికీ చిరు యాక్టింగ్, డాన్స్ అంటే యువతకి చచ్చేంత మోజు.. 70 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ మన మెగాస్టార్ చిరంజీవి తనదైన నటన, డాన్స్, ఫైట్స్ తో జనాలను అలరిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: