అవును... పారితోషికం విషయంలో టాలీవుడ్ హీరోలు కొండెక్కి కూర్చుంటున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మధ్య కాలంలో మన హీరోలు... మాకు ఎంత ఇస్తేనే సినిమా చేస్తాం, లేదంటే లేదు.. అని తెగేసి చెబుతున్నారట నిర్మాతలకు. నిజమే.. వారు అలా కోరుకోవడంలో తప్పేముంది? తెలుగు సినిమా స్థాయి పెరిగింది. వందల కోట్లలో వసూలు రాబడుతున్నాయి. ఒక్కో హీరో ముఖాన్ని బట్టి ఒక్కో రకమైన ఓపెనింగ్స్ ఉంటాయి. అలాంటప్పుడు హీరోలకు పారితోషికం ఎక్కువ ఇవ్వడంలో తప్పేముంది అని విశ్లేషకులు మాట్లాడుతున్నారు.

ఇలా ఎక్కువ అడుగుతున్న హీరోల లిస్టులో మొదటి వరుసలో ఉంటాడు మన డార్లింగ్ ప్రభాస్. ఆయన ఒక్కో సినిమాకు 200 కోట్ల మేర వసూలు చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం ఆయన సినిమాలు 1000 కోట్లు పైనే కలెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. బాహుబలి తర్వాత తాజాగా కల్కి సినిమా 1000 కోట్లు దాటి 1200 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. ఈ స్థాయి మార్కెట్ ఉన్న ప్రభాస్ ఆ మాత్రం కోరుకోవడంలో తప్పు లేదంటున్నారు. ఇక ప్రభాస్ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కూడా ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న నటుల జాబితాలో ఉన్నారు. ఇక వీరు సినిమాల సంగతి జనాలకు చెప్పనవసరం లేదు. వారి సినిమాలో ఓపెనింగ్స్ అదిరిపోతాయి కాబట్టి వీరు కూడా ఎక్కువ అడగడంలో తప్పులేదు అంటున్నారు విశ్లేషకులు.

ఆ తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ దాదాపు 100 కోట్ల పైన పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. త్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయి నటులు అయ్యారు. మీరు సినిమా ఏకంగా ఆస్కార్ అందుకుంది. దాంతో సహజంగానే వీరి రెమ్యూనరేషన్ ఆ స్థాయిని దాటి ఉంటుంది. ఆ తర్వాత ఎక్కువ పారితోషకం అందుకున్న నటుల లిస్టు చూస్తే... విజయ్ దేవరకొండ 50 కోట్లకు పైగా అందుకుంటున్నట్టు సమాచారం. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ సూపర్ మార్కెట్ సంపాదించాడు. దానికి అనుగుణంగానే ఆయన పారితోషికం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ హీరోల ముఖాలే సినిమాలను నడిపిస్తాయి. వారి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఓపెనింగ్స్ రాబడుతుంది. ఇటువంటి పక్షంలో హీరోలు పారితోషికం విషయంలో కొండెక్కి కూర్చున్నారు... అని నిర్మాతలు అతి చేయడం తగదని సినిమా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇక దీనిపై మీ అభిప్రాయం ఏమిటో ఇక్కడ తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: