తెలుగు చిశ్ర పరిశ్రమలో రీ-రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ‘పోకిరి’  సినిమాతో మొదలైన ఈ ట్రెండ్‌కి అభిమానుల నుంచి విశేష ఆదరణ లభించడంతో.. నిర్మాతలు వరుసగా పాత సినిమాల్ని రీ-రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా కల్ట్ ఫాలోయింగ్, గతంలో మంచి విజయాలు నమోదు చేసిన సినిమాల్నే తిరిగి థియేటర్లలో విడుదల చేస్తున్నారు.ఈనేపథ్యంలోనేఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 2వ తేదీన తన 56వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగానే గబ్బర్ సింగ్ మూవీ స్పెషల్ షోలు ఉండనున్నాయి. సెప్టెంబర్ 2న ఈ మూవీ థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేసింది.గబ్బర్ సింగ్ మూవీని సెప్టెంబర్ 2న రీ-రిలీజ్ చేస్తోంది అనుశ్రీ ఫిలిమ్స్. దీనిపై పోస్టర్ కూడా వచ్చింది. మొత్తంగా ఈ బ్లాక్‍బస్టర్ చిత్రాన్ని ఫ్యాన్స్ మరోసారి చూడవచ్చు. ఈ చిత్రం రీ-రిలీజ్‍కు హంగామా భారీ స్థాయిలో ఉండడం పక్కా.ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని అత‌డి సూప‌ర్ హిట్ సినిమాల్ని వ‌రుస‌గా రిలీజ్ చేస్తోన్నారు. ఇప్ప‌టికే జ‌ల్సా, ఖుషి, బద్రి రీ రిలీజై భారీగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టాయి. 

తాజాగా గ‌బ్బ‌ర్ సింగ్ రీ రిలీజ్ కాబోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.హ‌రీష్‌ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా 2012లో రిలీజైంది. దాదాపు 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 150 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాలీవుడ్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. స‌ల్మాన్‌ఖాన్ హీరోగా న‌టించిన బాలీవుడ్ మూవీ ద‌బాంగ్‌కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది.నిర్మాత బండ్ల  గణేష్ వ్యవహారించారు. పోలీస్ ఆఫీస‌ర్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాక్టింగ్‌, మేన‌రిజ‌మ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.  కాగా, పవన్ స్టార్ పవన్ కల్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను ఆయన చేయాల్సి ఉంది. అయితే, మూడు నెలలు పూర్తిగా తన మంత్రిత్వ శాఖల బాధ్యతల తర్వాత వీలైనప్పుడు షూటింగ్‍లను చేస్తానని పవన్ కల్యాణ్ ఇటీవల చెప్పారు.ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్‌తో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా చేస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. గ‌బ్బ‌ర్‌సింగ్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్, హ‌రీష్ శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న‌ సినిమా ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: