హీరోగా అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మరియు ఎన్నో విధమైన టాలెంట్ తో ఎంతోమంది సెలబ్రిటీస్ సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు . అలా మంచి గుర్తింపు దక్కించుకున్న మురళి మోహన్ అతిలోక సుందరి దివంగత శ్రీదేవి పై తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు . దాసరి నారాయణరావు డైరెక్షన్లో వచ్చిన మా బంగారక్క చిత్రంలో శ్రీదేవి బాలనటిగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే ‌. అప్పుడు తనకు మెచ్యూరిటీ లేదని మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు .


ఇక శ్రీదేవి ఎప్పుడూ చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తూ చిన్న పిల్లలను వెంట వేసుకుని తిరుగుతుందని ఆయన ఇంటర్వ్యూలో తెలిపారు ‌ . అలాగే ఈ మూవీ షూటింగ్లో జరిగిన మరో ఘటన గురించి కూడా మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు . " ఓ రోజు చైల్డ్ ఆర్టిస్టులతో షూటింగ్ ఉండగా .. ప్రొడక్షన్ వారు పలువు రు పాలనటుల్ని తీసుకొచ్చారు . అయితే షూటింగ్ చూడాలని లిస్టులో లేని ఓ పిల్ల కూడా వచ్చింది . షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి మా పాప ఏదని అడగగా .. తాను మా మూవీలో లేదని చెప్పేసాం .


మరో అమ్మాయితో మా పాప వచ్చిందండి అంటూ చాలా కంగారు పడ్డారు . మిగతా పిల్లల్ని అడిగేసరికి చెరువులో షూటింగ్ అనంతరం కనిపించడం లేదని చెప్పారు . దీంతో అక్కడున్న వారంతా ఆ గ్రామ ప్రజలంతా వెతుకుతూ వెళ్లారు . రాత్రి వరకు వెతికిన ఆ పిల్ల దొరకలేదు . మార్నింగ్ చూసేసరికి చెరువులో కూరుకుపోయి కనిపించింది . దీంతో అందరం తీవ్ర విషాదానికి లోనయ్యాము " అంటూ మురళీమోహన్ కాస్త ఎమోషనల్ అయ్యారు . ప్రజెంట్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: