అచ్చ తెలుగు అమ్మాయి వేద శాస్త్రి అలియాస్ అర్చన శాస్త్రి గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సీనియర్ దర్శకుడు సత్తిబాబు దర్శకత్వంలో వచ్చినటువంటి నేను అనే చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో తన లుక్, యాక్టింగ్ తో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. నేను సినిమా అనంతరం ఈ బ్యూటీకి వరుస పెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి. తెలుగు అమ్మాయి అయినప్పటికీ కన్నడలోనూ మంచి మంచి సినిమాల్లో నటించింది.


కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు ఈ భామ హవా తగ్గిపోయింది. దీనికి తోడుగా ఈ బ్యూటీకి ఎక్కువశాతం గెస్ట్ అప్పియరెన్స్, సహాయ నటి పాత్రలే రావడంతో పెద్దగా అర్చనకు గుర్తింపు రాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏమైందో తెలియదు ఎవరికి కనిపించకుండా పోయింది. ఇక చాలా రోజులకి బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ లో ఈ బ్యూటీ కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పించింది. కానీ బిగ్బాస్ ఫేమ్ తనకు పెద్దగా ఉపయోగపడలేదు.


ఇక ఆ తర్వాత బుల్లితెర షోలలో జడ్జిగా వ్యవహరించింది. ఇక సినిమాలకు, షోలకు దూరమై.... తన ప్రియుడు జగదీష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇదిలా ఉండగా ....ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్ చేసింది. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ గురించి సంచలన వాక్యాలు చేసింది. తాను ఓ మలయాళ సినిమా చేస్తున్న సమయంలో ఓ స్టార్ హీరో తనకు అసభ్యకరంగా మెసేజ్ లు పెట్టేవాడని చెప్పుకొచ్చింది.


ఇక ఆ మెసేజ్ లకు తాను రిప్లై ఇవ్వలేదని.... చివరికి నేను రిప్లై ఇవ్వకపోవడంతో హర్ట్ అయినటువంటి ఆ హీరో సినిమాల్లోంచి నన్ను తప్పించాడని చెప్పుకొచ్చింది. ఇక ఆ హీరో ఎవరనేది మాత్రం అర్చన చెప్పలేదు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్లు ఉంటాయి. కానీ వాటిని ధైర్యంగా ఎదిరించి, తట్టుకొని నిలబడాలని సంచలన కామెంట్లు చేసింది. ప్రస్తుతం అర్చన చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: