టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు 'పుష్ప' ఎంతటి క్రేజ్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్యాన్ ఇండియా లెవల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టామినా ఏంటో ఈ మూవీ నిరూపించింది. సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు 'పుష్ప' అందరినీ మెప్పించింది. ఈ సినిమా పార్ట్-2 గురించి అంతా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో పుష్ప-2ను రిలీజ్ చేస్తే ఇబ్బందుల్లో పడతామంటూ మేకర్స్ భావిస్తున్నారని ఫిలింనగర్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజవుతున్న పుష్ప-2పై భారీ అంచనాలున్నాయి. పైగా పార్ట్ -1 దేశాన్ని ఊపేయడంతో .. సీక్వెల్ ఎలా ఉండబోతుందోనని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈసారి రూ.1000 కోట్ల కలెక్షన్స్ అవలీలగా కొట్టేస్తామని చిత్ర యూనిట్ ధీమాగా చెబుతున్న వేళ.. అల్లు అర్జున్ - మెగా ఫ్యామిలీ వివాదం వారి ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తోంది.జరిగిన ఏపీ ఎలక్షన్స్  లో అల్లు అర్జున్  తన స్నేహితుడు నంద్యాల అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట్ చేయడం అల్లు అర్జున్ ని మెగా ఫాన్స్ కి కంటయ్యేలా చేసింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ మీద ఫైర్ మీద ఉన్నారు. ఈ ఇంపాక్ట్ కచ్చితంగా పుష్ప రెండో భాగం మీద పడుతుందని చెప్పొచ్చు. డిసెంబర్ 6న రిలీజ్ ప్లాన్ చేసిన పుష్ప 2 సినిమా జరుగుతున్న షూటింగ్ లేట్ వల్ల అప్పటివరకు వస్తుందా లేదా అన్న డౌట్ కూడా వ్యక్తపరుస్తున్నారు.అంచనాలకు తగినట్టుగా ఉంటే ఇది 1000 కోట్ల దాకా బాక్సాఫీస్ లెక్కలు రాబట్టే అవకాశం ఉంది. అయితే మెగా ఫ్యాన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అండదండలు లేకుండా పుష్ప 2 ఆ టార్గెట్ రీచ్ అవ్వటం సాధ్యపడుతుందా లేదా అన్న డౌట్ మొదలైంది.

ఈ పరిణామాలు అల్లు అర్జున్ అప్‌కమింగ్ మూవీ పుష్ప-2పై ప్రభావం చూపుతాయేమోనని ట్రేడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో చెప్పను బ్రదర్ అంటూ బన్నీ అన్న ఒక్క మాటతో ఆయన నటించిన ఓ సినిమాపై కసి తీర్చుకున్నారు మెగా, పవన్ అభిమానులు. నెగిటివ్ రివ్యూలు, నెగిటివ్ పబ్లిసిటీ చేయడంతో సదరు సినిమా అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పటి పరస్థితులు అంతకంటే దారుణంగా ఉండటం, పైగా పవన్ విక్టరీ సక్సెస్ కొట్టడంతో ఫ్యాన్స్ కూడా మాంచి ఊపులో ఉన్నారు.పుష్ప సినిమా ఒక టాలీవుడ్ నటుడికి తొలి జాతీయ అవార్డుని తెచ్చిపెట్టింది అని గర్వపడుతుంటే.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా రాబోతున్న పుష్ప 2 సినిమా ఇద్దరు ప్రాణ స్నేహితులను బద్ధ శత్రువులుగా మార్చిందా అన్నట్లు ఉంది ఇప్పుడు పరిస్థితి.కానీ సుకుమార్ మాత్రం ఈ సినిమా షూటింగ్ ఎప్పటికీ తేల్చడం లేదు. కొందరేమో సుకుమార్ వైఖరి నచ్చకే బ్రేక్ తీసుకున్నట్లు చెబుతున్నారు. మరికొందరు మాత్రం షూటింగ్ మధ్యలో మామూలుగానే బ్రేక్ తీసుకున్నారని.. అంతే తప్ప ఎలాంటి గొడవలు లేవు అని కామెంట్లు చేస్తున్నారు. మరి ఎందులో నిజం ఉందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: