యూనివర్సల్ హీరో కమల్ హాసన్  హీరోగా ఐకానిక్ దర్శకుడు శంకర్ సారథ్యంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా హిట్ చిత్రం “ఇండియన్” తెలుగులో “భారతీయుడు” అందుకున్న విజయం కోసం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా “భారతీయుడు 2”ఈ నెల 12న రిలీజ్ అవ్వగ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.అయితే తాజాగా భారతీయుడు 2 సినిమాలో 12 నిముషాలు కట్ చేసారని, ఎడిటింగ్ లో 12 నిముషాలు తీసేసి సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నామని, ఇప్పుడు థియేటర్స్ లో కట్ చేసిన సినిమానే వేస్తున్నామని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.దీంతో ఈ పనేదో ముందే చేసి ఉండొచ్చుగా, ఇప్పుడు  ఎంత కోత పెట్టిన ప్రయోజనం లేదు అంటున్నారు నెటిజన్స్.కట్ చేసినా కథ మారదుగా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే సాగదీత ఎక్కువగా ఉన్న సీన్స్ లో కొంత భాగం కట్ చేశారు. కానీ ఆల్రెడీ ఎల్లుండి నుంచి మళ్ళీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో భారతీయుడు సినిమాని ఇప్పుడు థియేటర్స్ కి వెళ్లి చూడటం జరిగే పని కాదు. థియేటర్స్ కూడా తగ్గుతాయి. దీంతో ఇప్పుడు కట్ చేసినా కలెక్షన్స్ పరంగా అంతగా యూజ్ ఉండదని సినిమా వ్యక్తులు అంటున్నారు.ఇదిలా ఉండగా భారతీయుడు సినిమాలో ఎన్నో సీన్లు కంట్లోంచి కన్నీటిని కార్చేలా చేస్తుంది. కానీ ఈ రెండో పార్టులో ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా గుండెను తాకేలా ఒక్క సీన్ కూడా కనిపించదు. మూడో పార్ట్ కోసం మళ్లీ వెనక్కి వెళ్లాడు శంకర్. స్వతంత్రానికి పూర్వం వీరశంకర్ సేనాపతి (కమల్ హాసన్) చేసిన పోరాటాన్ని చూపించబోతోన్నాడు. అది అయినా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందా? వార్ సీన్లను అద్భుతంగా మలిచాడా? లేదా? అన్నది చూడాలి. రెండో పార్టు అయితే శంకర్, కమల్ హాసన్ స్థాయి కాదని తేలిపోయింది. మరి మూడో పార్టు ఎలా ఉంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: