మాస్ రాజా రవితేజ కెరీర్‌ లో ‘విక్రమార్కుడు’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా ను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించ గా పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రం గా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌ గా నిలిచింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో రవితేజ కెరీర్‌లో టాప్ మూవీగా మిగిలింది 2006 లో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ రవితేజ కెరీర్ ను మలుపు తిప్పిందనే చెప్పాలి.ఈ సినిమా లోబ్రహ్మానందం, రాజీవ్ కనకాల, అజయ్, వినీత్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా లో గార్జియస్ బ్యూటీ అనుష్క శెట్టి కథానాయిక. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందించారు. . ఈ సినిమాను ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎంజాయ్ చేశారో అందరికీ తెలిసిందే.ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ హంగామా నడుస్తోంది. తమ అభిమాన హీరోలు నటించిన పాత సినిమాలకు, కొత్త టెక్నాలజీ జత చేసి మళ్లీ రిలీజ్ చేయడం అనే సంస్కృతి ఊపందుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మహేష్, పవన్ కల్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ నటించిన పాత సినిమాల్ని 4కే రిజల్యూషన్ లోకి మార్చి రీ-రిలీజ్ చేశారు. ఇప్పుడీ లిస్ట్ లోకి రవితేజ కూడా చేరిపోయాడు.రవితేజ బెస్ట్ సినిమాల్లో విక్రమార్కుడు ఒకటి. మాస్టర్ స్టోరీటెల్లర్ SS రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఈ నెల 27న రీ రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు.విక్రమార్కుడు యొక్క 4K వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ప్రదర్శించ బడుతుంది.మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తాం అంటున్నారు మూవీ మేకర్స్.
మరి ఈ సినిమా రీ-రిలీజ్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి అంటున్నారు మాస్ రాజా ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: